ఏపీకి పెద్ద చుట్టమేనట.. జూమ్ యాప్ ద్వారానేనట

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎలా ఉండేవారు. ఎలా మాట్లాడేవారు. ఇవన్నీ ప్రజలకు ఎరుకే. అమరావతి రాజధాని అంటూ వీరాభిమానం చూపించి ఏపీ తన శాశ్వత నివాసం అన్నట్లుగా [more]

Update: 2020-06-03 13:30 GMT

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎలా ఉండేవారు. ఎలా మాట్లాడేవారు. ఇవన్నీ ప్రజలకు ఎరుకే. అమరావతి రాజధాని అంటూ వీరాభిమానం చూపించి ఏపీ తన శాశ్వత నివాసం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు ఇలా ఓడారో లేదో అలా హైదరాబాద్ చెక్కేశారు. అంటే ముఖ్యమంత్రిగా పనిచేస్తేనే ఏపీలో ఉంటారన్న మాట. అమరావతి పాట పాడుతారన్నమాట. మరి ఆ మాత్రం దానికి ఆంధ్రులు, పౌరుషం అంటూ నినాదాలు ఎందుకు బాబూ అని సెటైర్లు పడుతున్నాయి. గత ఏడాది ఇదే నెలలో ఎన్నికల ఫలితాలు రావడం చంద్రబాబు సర్కార్ ఓడడం జరిగాయి. ఆ మీదట చంద్రబాబు హైదరాబాద్ కి మకాం పూర్తిగా మార్చేసారు. వీకెండ్స్ లో వెళ్లడం, మండే రావడం ఇలా తనదైన శైలిలో ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్నారు.

కరోనా దెబ్బకు….

ఇక ఏపీలో మూడు నెలలుగా వీర విహారం చేస్తున్న కరోనా దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ వదిలిరాలేదు. మధ్యలో మహానాడు అనే తంతు ఒకటి ఉంది. అది పొరుగు రాష్ట్రం నుంచి చేస్తే బాగుండదన్న ఆలోచనతోనే చంద్రబాబు ఏపీకి వచ్చి ఉండవల్లిలోని కరకట్ట నివాసంలో మూడు రోజులు విడిది చేశారు. జూం జాం గా యాప్ ద్వారా మహానాడు నిర్వహించుకుని వచ్చిన దారినే బాబు హైదరాబాద్ బాట పట్టేశారు. అంటే మళ్ళీ చంద్రబాబు ఎపుడు వస్తారో తమ్ముళ్లకే తెలియదులా ఉంది.

చుట్టపు చూపే….

ఇక చంద్రబాబు అమరావతి రావడం అన్నది చుట్టపు చూపుగానే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే కరోనా మహమ్మారి ఓ వైపు ఉంది. చంద్రబాబు వంటి వయో వ్రుధ్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏపీకి వచ్చినా కొద్ది రోజులు గడిపి మాత్రమే వెళ్ళిపోవడం చేయాలి. ఇదీ బాబు సరికొత్త విధానంగా ఉంది. హైదరాబాద్ లోని ఇంట్లో తనకు తానుగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ జాం యాప్ ద్వారానే బాబు ఇకపైన పార్టీ కార్యక్రమాలు నడిపిస్తారని అంటున్నారు. ఎక్కడ ఉన్నా జాం యాప్ దిక్కు అయిన వేళ చంద్రబాబు సొంతింట్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారని, ఆరోగ్యం దృష్ట్యా కూడా అదే సేఫ్ అని భావిస్తున్నారని అంటున్నారు. ఇక ఇప్పటప్పట్లో జనాలలో తిరిగే అవకాశం అయితే లేదు. అందువల్లనే చంద్రబాబు చలో హైదరాబాద్ అంటున్నారని తెలుస్తోంది.

జగన్ ని అన్నారే…?

ఇక తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అని అంటారు. నాడు జగన్ హైదరాబాద్ లో ఉంటే లోటస్ పాండ్ పార్టీ, పొరుగున ఉన్న విపక్ష నేత అంటూ ఇదే టీడీపీ నానా యాగీ చేసేది. నిజానికి జగన్ హైదరాబాద్ లో ఉన్నా కూడా తరచూ వివిధ కార్యక్రమాల రూపేణా ఏపీలోనే ఉండేవారు. ఇక దాదాపు ఏణ్ణర్ధం పాటు పాదయాత్ర అంటూ జనంలోనే ఉన్నారు. మరి నాడు తమ్ముళ్లు ఘాటుగా జగన్ ని విమర్శించేవారు. ఇపుడు తమ నాయకుడు కూడా అదే పని చేస్తూంటే కిమ్మనలేకపోతున్నారు. మరి క్యాడర్ ఇలా దిగాలుగా ఉన్న వేళ బాబు అక్కడ కూర్చుని పార్టీని ఎలా చక్కదిద్దుతారో చూడాలి. అయితే వైసీపీ నేతలు మాత్రం వదలడంలేదు. చంద్రబాబు ఇక కేరాఫ్ హైదరాబాదేనని సెటైర్లు వేస్తున్నారు. టీడీపీని కూడా జూం యాప్ లోనే చూసుకోవాలని, ఆ పార్టీ జనంలో లేదని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News