కక్కి పడేశారుగా…. కడిగి పడేశారుగా?

ఏ రాజకీయ పార్టీలో అయినా భిన్నాభిప్రాయాలు సహజమే. వాటిని వివిధ వేదికల్లో చర్చించుకోవడం ప్రజాస్వామ్యమే. అయితే అంతర్గతంగా చర్చించుకోవాలిసిన కీలక అంశాలు ఇప్పుడు బాహాటంగా టిడిపి మహానాడు [more]

Update: 2020-05-29 14:30 GMT

ఏ రాజకీయ పార్టీలో అయినా భిన్నాభిప్రాయాలు సహజమే. వాటిని వివిధ వేదికల్లో చర్చించుకోవడం ప్రజాస్వామ్యమే. అయితే అంతర్గతంగా చర్చించుకోవాలిసిన కీలక అంశాలు ఇప్పుడు బాహాటంగా టిడిపి మహానాడు లో నేతలు కక్కేస్తున్నారు. అధికారంలో ఉండగా అధినేత ముందు మాట్లాడటానికే భయపడిన నేతలు ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోతున్నారు. పార్టీలో లోపాలను తూర్పారబట్టేస్తున్నారు. స్వయంగా అధినేత చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలని సూచనలే చేసేస్తున్నారు.

రాజప్ప అలా, , జ్యోతుల మరోలా …

టిడిపి అధినేతపై ఎవరైనా విమర్శలు చేస్తే చూస్తూ ఉరుకుంటే ఎలా? అని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గళం ఎత్తారు డిజిటల్ మహానాడు వేదికగా. అధికారం లో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు మాత్రం మిన్నకుండిపోవడం సరికాదన్నది రాజప్ప ఆవేదన. ఆయన వ్యాఖ్యలకు జగ్గంపేట మాజీ ఎమ్యెల్యే జ్యోతుల నెహ్రు ఘాటుగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. పదవులు కొందరికి అదృష్టం కొద్ది కూడా సంక్రమిస్తాయని రాజప్పను దెప్పిపొడిచారు ఆయన. అంతేకాదు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు కూడా ఎవరో అర్ధం కావడం లేదంటూ టిడిపి దీనస్థితిని అందరిలో చెప్పేశారు.

ఇదే బాటలో …

ఇక రాయలసీమ నేత మోహన్ మరికొంత ఘాటుగా నే స్పందించారు. చంద్రబాబు పవర్ పోవడానికి సతీష్ చంద్ర వంటివారు కారణమని ఇలాంటి వారు అధినేతకు క్యాడర్ కి లైన్ కట్ చేయడం వల్లే పార్టీ ఘోరపరాజయానికి కారణం అని ఆరోపించారు. ఇలా ఒక్కోరు ఒక్కోరకంగా చంద్రబాబు నాయకత్వ లోపాలను ఎత్తిచూపిస్తున్నారు. దాంతో మహానాడు ద్వారా వస్తుందనుకున్న మైలేజ్ ఈ నెగిటివ్ కామెంట్స్ తో దెబ్బతింటుందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీలో జరుగుతున్న తప్పులను అధినేత ఎంతవరకు సరిచేసుకుని ముందుకు వెళ్తారన్నది చుడాలిసిఉంది.

Tags:    

Similar News