Tdp : ఆయన కోసం ఆ సీటును రిజర్వ్ చేశారట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ వీడిపోయిన వారిని తిరిగి చేర్చుకునేది లేదని చెబుతున్నారు. అయితే కొంతమందికి మాత్రం మినహాయింపు ఉంటుంది. వైసీీపీ ప్రభుత్వం వత్తిడులను తట్టుకోలేక, [more]

Update: 2021-11-12 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ వీడిపోయిన వారిని తిరిగి చేర్చుకునేది లేదని చెబుతున్నారు. అయితే కొంతమందికి మాత్రం మినహాయింపు ఉంటుంది. వైసీీపీ ప్రభుత్వం వత్తిడులను తట్టుకోలేక, వ్యాపారాల కోసం పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకుంటామని చెబుతున్నారు. పార్టీని వీడినా వాళ్ల మనసంతా ఇక్కడే ఉందని, కొన్ని కారాణాల వల్లనే పార్టీని వీడారని చంద్రబాబు సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం.

ఆర్థికంగా.. సామాజికపరంగా….

ప్రకాశం జిల్లాలో టీడీపీకి మొన్నటి వరకూ కీలక నేతగా ఉన్న శిద్ధా రాఘవరావు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. శిద్ధా రాఘవరావు 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. వైశ్య సామాజికవర్గానికి చెందని శిద్ధా రాఘవరావు చంద్రబాబుకు నమ్మకమైన నేతగా గుర్తింపు పొందారు. ఆర్థికంగా పార్టీని ఆయన ఆదుకున్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతాయి. గత ఎన్నికలలో టీడీపీ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

వైసీపీలో ప్రాధాన్యత లేకుండా….

వైసీపీలో చేరినా ఆయనకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. టీడీపీలో దక్కిన గౌరవంలో ఒక్క శాతం కూడా దక్కడంలేదు. దీంతో ఆయన కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. టీడీపీలో వెంటనే చేరిపోవచ్చు కాని, గ్రానైట్ వ్యాపారాలు ఉండటంతో ఇప్పుడే రిస్క్ చేయడం ఎందుకని ఆయన వేచి చూస్తున్నారు. సమయం చూసుకుని టీడీపీలోకి రావచ్చని ప్లాన్ చేసుకున్నారు. దీనికి తోడు ఇటీవల దర్శి నియోజకవర్గానికి చంద్రబాబు ఇన్ ఛార్జిని నియమించారు.

తాత్కాలికమేనట….

పమిడి రమేష్ ను దర్శి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించడంతో శిద్ధారాఘవరావుకు చంద్రబాబు చెక్ పెట్టారని అందరూ భావించారు. కానీ ఇందులో తిరకాసు ఉందంటున్నారు. దర్శి నియోజకవర్గంపై శిద్ధా రాఘవరావుకు పట్టుంది. పమిడి రమేష్ ఇన్ ఛార్జి పదవి తాత్కాలికమేనంటున్నారు. ఎన్నికలకు ముందు శిద్ధారాఘవరావు పార్టీలో చేరతారని, ఆయనకే దర్శి టిక్కెట్ ను చంద్రబాబు రిజర్వ్ చేశారని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

Tags:    

Similar News