భవిష‌్యత్ బుగ్గిపాలు చేశారుగా..?

రాజకీయాల్లో ఎవరిని ఎలా వాడుకోవాలో టీడీపీ నేత చంద్రబాబుకు బాగా తెలుసు. ముఖ్యంగా ఎన్నికల్లో అప్పటికప్పుడు వచ్చే పరిస్థితులని బట్టి చంద్రబాబు నాయకులని వాడుతుంటారు. ఇక ఆ [more]

Update: 2019-11-25 00:30 GMT

రాజకీయాల్లో ఎవరిని ఎలా వాడుకోవాలో టీడీపీ నేత చంద్రబాబుకు బాగా తెలుసు. ముఖ్యంగా ఎన్నికల్లో అప్పటికప్పుడు వచ్చే పరిస్థితులని బట్టి చంద్రబాబు నాయకులని వాడుతుంటారు. ఇక ఆ సమయంలో నాయకులు విజయం సాధిస్తే పర్లేదు… లేదంటే ఆ నేత రాజకీయ భవిష్యత్తే గందరగోళంలో పడిపోతుంది. ఈ ఏడాది ఎన్నిక‌ల్లో చంద్రబాబు మాజీ కేంద్ర మంత్రులు ప‌న‌బాక ల‌క్ష్మి, వైరిచ‌ర్ల కిషోర్ చంద్రదేవ్ లాంటి వాళ్లను చివ‌ర్లో వాడుకున్నారు. ఇప్పుడు పార్టీ ఓడిపోవ‌డంతో వాళ్ల అవ‌స‌ర‌మే చంద్రబాబుకు ఉండ‌దు. ఇలా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్లను ప‌క్కన పెడితే పార్టీ కోసం ఎంతో క‌మిట్‌మెంట్‌తో ఉంటూ.. వ్యక్తిగ‌త ఇమేజ్‌తో కూడా వ‌రుస విజ‌యాలు సాధిస్తోన్న ఓ యంగ్ లీడ‌ర్ కెరీర్ బాబు చేసిన చిన్న పొర‌పాటుతో ఎటూ కాకుండా పోయింది. టీడీపీలో క్లీన్ ఇమేజ్ గల నేత వేటుకూరి వెంకటశివరామరాజు(కలవపూడి శివ) భవిష్యత్ గంర‌ద‌గోళంగా మారింది.

రెండు సార్లు ఎమ్మెల్యేగా….

కలవపూడి శివ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో 17 వేల మెజారిటీతో గెలిచిన శివ….2014లో 36 వేల మెజారిటీతో గెలిచారు. అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న శివ మాత్రం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. అలాగే సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. శివ‌కు వ్యక్తిగ‌త ఇమేజ్ ఉండ‌డంతోనే 2009లో వైఎస్ గాలిలో కూడా అంత మెజార్టీతో గెలిచారు.

బలవంతంగా పంపడంతో…..

అయితే ఇలాంటి నేత మరోసారి విజయం సాధించడం ఖాయమనుకున్న తరుణంలో చంద్రబాబు వ్యూహాత్మక అడుగేశారు. ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న రఘురామకృష్ణంరాజు వైసీపీలోకి వెళ్లడంతో కలవపూడి శివని నరసాపురం పార్లమెంట్ బరిలో దించారు. శివ‌కు ఎంపీగా పోటీ చేయ‌డం ఇష్టం లేదు. అయితే ఉండిలో శివ‌కు స‌న్నిహితుడు అయిన కలవపూడి రాంబాబుకు సీటు ఇచ్చే క్రమంలో చంద్రబాబు శివ‌ను బ‌ల‌వంతంగా పార్లమెంటుకు పోటీ చేయించారు. అయితే ఉండి నుంచి రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ శివ మాత్రం నరసాపురంలో ఓడిపోయారు. గట్టి పోటీ ఇచ్చి కేవలం 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఏమీ చేయలేక…?

ఇక ఓడిపోయిన దగ్గర నుంచి శివ పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. అయితే చంద్రబాబు వల్ల శివ ఈ పరిస్థితిలో ఉండిపోయారు. ఒకవేళ ఉండిలో పోటీ చేసి ఉంటే శివ మరోసారి ఎమ్మెల్యే అయ్యేవారు. ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ కొట్టి ఉండేవారు. కానీ ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయారు. అస‌లు శివ భవిష్యత్ ఏంటనేది అర్ధం కాకుండా ఉంది. మ‌రోవైపు ఎమ్మెల్యేగా గెలిచిన రాంబాబు జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక‌రు కావ‌డంతో ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ అటు జిల్లా రాజ‌కీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. జిల్లాలో పార్టీ ప‌ర‌మైన కార్యక్రమ‌ల్లో కూడా ఆయ‌న‌కు ఇంపార్టెన్స్ ద‌క్కుతోంది. దీంతో నిన్నటి వ‌ర‌కు ఉండిలో ఓ వెలుగు వెలిగిన శివ‌ను ఇప్పుడు పార్టీలో కూడా ఎవ్వరూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అటు జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయ‌న క‌న‌ప‌డ‌డం లేదు. మొత్తానికైతే చంద్రబాబు శివ రాజకీయ భవిష్యత్తుని గందరగోళంలోకి నెట్టేశారు.

Tags:    

Similar News