Tdp : ఇక వాళ్లతో వేస్ట్ అట.. కటీఫ్ కు కొద్ది దూరంలో?

రాజకీయాల్లో ప్రత్యర్థిని కాపాడేవారు శత్రువులే. కానీ ఎంతకాలం ఓపిక పట్టగలరు. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం వ్యతిరేకించక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ మధ్య ఇలాంటి [more]

Update: 2021-10-12 08:00 GMT

రాజకీయాల్లో ప్రత్యర్థిని కాపాడేవారు శత్రువులే. కానీ ఎంతకాలం ఓపిక పట్టగలరు. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం వ్యతిరేకించక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ మధ్య ఇలాంటి పరిస్థితి కనపడుతుంది. ఏపీలో అధికార, విపక్ష పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని అంశాల్లో మద్దతు పలుకుతూ వస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదని మేధావులు సయితం చెెబుతున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమంటూ దాటవేస్తూ చంద్రబాబు, జగన్ లు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.

రెండున్నరేళ్ల నుంచి….

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం గత రెండున్నరేళ్ల నుంచి బీజేపీని ఎక్కడా కార్నర్ చేయలేదు. పైగా కొన్ని విషయాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు పలికారు. కరోనా సమయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన చంద్రబాబు కరోనా సెకండ్ వేవ్ లో కేంద్ర ప్రభుత్వం విఫలమయినా పట్టించుకోలేదు.

ఆ సాహసాన్ని…..

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలోనూ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే సాహసాన్ని చేయలేదు. అయితే ఇటీవల కాలంలో ఆయన ధోరణి మారిందని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనాలంటే ఇటు జనసేనతో పాటు అటు వామపక్షాలను కూడా కలుపుకుని పోవాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు స్లోగా బీజేపీని టార్గెట్ చేయాలని నిర్ణయించారు. జగన్ తో సత్సంబంధాలు నెరుపుతూ తనను ఇరకాటంలో పెడుతున్న బీజేపీతో కలవడం సాధ్యం కాదని ఆయనకు అర్థమయింది.

త్వరలో కార్యాచరణ….

అందుకే ముందుగా టీడీపీ నేతల చేత బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో పాటు, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, వ్యవసాయ చట్టాలు వంటి అంశాలపై త్వరలో టీడీపీ ప్రత్యక్ష పోరాటాలకు దిగే అవకాశాలున్నాయి. మోదీ ఇమేజ్ కూడా తగ్గుముఖం పడుతుండటంతో త్వరలో బీజేపీ వ్యతిరేక పోరాట కార్యక్రమాలపై చంద్రబాబు కార్యాచరణను ప్రకటించే అవకాశముంది.

Tags:    

Similar News