Chandrababu : జగన్ ను గద్దె దించడం చాలా ఈజీ అట..ఇలాగేనట

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు కు ఒకరకంగా వచ్చే ఎన్నికలే చివరవి. ఈ ఎన్నికల్లో ఓటమి పాలయితే తన రాజకీయ [more]

Update: 2021-09-28 05:00 GMT

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు కు ఒకరకంగా వచ్చే ఎన్నికలే చివరవి. ఈ ఎన్నికల్లో ఓటమి పాలయితే తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లే. ఇక పార్టీ పరిస్థితి కూడా దారుణంగా తయారవుతుంది. అందుకే చంద్రబాబు ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సమయంలోనూ ఆయన ఇంట్లో ఉండి చేస్తున్న కసరత్తు మ్యానిఫేస్టో రూపకల్పన అట. ఇప్పుడు ఇది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

మ్యానిఫేస్టో రూపకల్పనలో….

సహజంగా మ్యానిఫేస్టో ను ఎన్నికలకు ముందు తయారు చేస్తారు. కానీ చంద్రబాబు ఖాళీగా దాదాపు పదినెలల పాటు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన వివిధ రంగాల నిపుణులతో చర్చించారు. కరోనా కారణంగా బయటకు రాలేదని చెబుతున్నా చంద్రబాబు నివాసంలో రోజుకో మీటింగ్ జరిగేది అని చెబుతున్నారు. ఇది పార్టీ మీటింగ్ కాదు. కానీ ఈ మీటింగ్ కు చంద్రబాబు కరోనాపై యుద్ధం చేయడానికి నిపుణుల సలహా తీసుకుంటున్నానని చెప్పారు.

వివిధ రంగాల నిపుణలతో….

కానీ చంద్రబాబు ఆర్థిక, బ్యాకింగ్, పారిశ్రామిక, వ్యవసాయ రంగ నిపుణులతో ఎక్కువగా సమావేశమయినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం మ్యానిఫేస్టో. ఈ మ్యానిఫేస్టోలో జగన్ ను మించి హామీలు ఉండేలా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి పెద్దయెత్తున ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. రైతు సమస్యలతో పాటు వారికివ్వాల్సిన సబ్డిడీలు, విద్యుత్తు రాయితీలు, రుణ మాఫీ వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి.

నమ్మితే అధికారమేనట….

వ్యవసాయ రంగమే కాకుండా వివిధ రంగాలపై చంద్రబాబు దృష్టిపెట్టారు. ప్రధానంగా యువత కు నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పనతో పాటు వచ్చిన వెంటనే రెండున్నర లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పింఛన్ల సంఖ్యను పెంచడమే కాకుండా అధికారంలోకి రాగానే 3,500లు పింఛను చేస్తామని కూడా చంద్రబాబు మ్యానిఫేస్టోలో చెప్పనున్నారు. మహిళలను ఆకట్టుకునే దిశగా కూడా కొన్ని పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. చంద్రబాబు దగ్గరుండి ఈ మ్యానిఫేస్టోను పర్యవేక్షిస్తున్నారు. మరి చంద్రబాబు మ్యానిఫేస్టోను జనం నమ్మితే అధికారం ఆయన చెంతకే చేరుతుంది. నమ్మకపోతే మాత్రం మరో సారి భంగపాటు తప్పదు.

Tags:    

Similar News