Chandrababu : బాబు ఘాటు కామెంట్స్… అక్కడ పొత్తు వారితోనేనా?

తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ పూర్తి పతనావస్థకు చేరుకుంది. ఇక్కడ నేతలతో పాటు క్యాడర్ కూడా ఇతర పార్టీలకు వెళ్లిపోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి [more]

Update: 2021-09-21 09:30 GMT

తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ పూర్తి పతనావస్థకు చేరుకుంది. ఇక్కడ నేతలతో పాటు క్యాడర్ కూడా ఇతర పార్టీలకు వెళ్లిపోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ తో నడిచి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లే ఉంది. ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు లేవు. గత ఎన్నికల్లో మాదిరి ఈసారి కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన ఇటీవల తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

2018 ఎన్నికల తర్వాత….

రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు తెలంగాణ పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఓటుకు నోటు కేసు వివాదం తలెత్తాక చంద్రబాబు 2018 ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగారు. అయితే ఆ కూటమి ప్రయత్నాలు ఫలించలేదు. ఇక అక్కడి నుంచి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. కానీ తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారాయి.

ఘాటు వ్యాఖ్యలతో….

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. తనకు అత్యంత నమ్మకస్థుడిగా ఉన్న పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణను టీఆర్ఎస్ లోకి తీసుకోవడం, పార్టీలో అగ్రనేతలందరినీ ఆకర్షిస్తుండటంతోనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. కేసీఆర్ రెండుసార్లు విజయం సాధించడంతో ఈసారి అంత సులువు కాదని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.

ఆ పార్టీతోనే మళ్లీ….

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పార్టీ కీలకంగా మారనుంది. దీంతోనే చంద్రబాబు ఈసారి కూడా కాంగ్రెస్ తో కలసి తెలంగాణలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో బీజేపీతో కలసి ప్రయాణం చేసే అవకాశాలు లేవు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తనకు సన్నిహితుడు కావడంతో చంద్రబాబు అటువైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు.

Tags:    

Similar News