Chandrababu : ఆయనకు బాబు గుడ్ బై చెప్పేశారట

తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ఉన్నారా? లేదా? ఉంటే ఆయనను ఎందుకు ముందు పెట్టడం లేదు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ [more]

Update: 2021-09-25 03:30 GMT

తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ఉన్నారా? లేదా? ఉంటే ఆయనను ఎందుకు ముందు పెట్టడం లేదు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ టీమ్ లో పనిచేసిన రాబిన్ శర్మ ను వ్యూహకర్తగా నియమించుకున్నారన్న వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే వ్యూహకర్త అవసరం కూడా ఉందని చంద్రబాబు భావించారు. అందుకే రాబిన్ శర్మ సహకారం తీసుకున్నారంటున్నారు.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో…

రాబిన్ శర్మను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక వరకూ ఎన్నికల వ్యూహకర్తగానే కొనసాగారంటున్నారు. అయితే ఇటీవల ఆయనను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. రాబిన్ శర్మ ఎత్తుగడలు, వ్యూహాలు తమకు పనికిరావని చంద్రబాబు భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఈ విషయం వెల్లడయింది. వైసీపీ నియమించిన వాలంటీర్ల తరహాలోనే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ప్రతి యాభై మందికి ఒక కార్యకర్తను నియమించాలని భావించారు.

రాంగ్ గైడెన్స్….

కానీ చంద్రబాబు భావించినట్లు అది క్షేత్రస్థాయిలో సాధ్యపడలేదు. అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడటానికి ముందుకు రాకపోవడంతో బాబు వ్యూహం ఫలించలేదు. ఇక ఆలయాలపై దాడుల విషయంలోనూ తమను రాంగ్ ట్రాక్ పట్టించారన్న అభిప్రాయాన్ని చంద్రబాబు తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. రామతీర్థం నేరుగా తనను వెళ్లాలని రాబిన్ శర్మ చెప్పడం, ఆ తర్వాత ఘటనలు కూడా చంద్రబాబుకు మనస్థాపానికి గురి చేశాయంటున్నారు.

సొంత వ్యూహాలతోనే…

దీంతో రాబిన్ శర్మను పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే ఆయనతో చేసుకున్న ఒప్పందాన్ని చంద్రబాబు రద్దు చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన వ్యూహాలతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని, ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు వైసీపీకి పనిచేసినా తాను మాత్రం సొంత వ్యూహాలతోనే ముందుకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే రాబిన్ శర్మకు చంద్రబాబు గుడ్ బై చెప్పేశారంటున్నారు.

Tags:    

Similar News