ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే?

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. ఇటు ఉత్తరాంధ్ర, అటు [more]

Update: 2021-09-26 12:30 GMT

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమలో పార్టీ బలహీనమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండు ప్రాంతాల్లో ఓటు బ్యాంకు దెబ్బతినందన్న అనుమానాలు బయలుదేరాయి. అందుకోసమే చంద్రబాబు రెండు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

రెండు ప్రాంతాల్లో…

కర్నూలుకు న్యాయరాజధాని, విశాఖకు పరిపాలన రాజధానిని తీసుకొస్తామని జగన్ ప్రకటించిన తర్వాత టీడీపీ ఆ ప్రాంతాల్లో రాజకీయంగా ఇబ్బంది ఎదుర్కొంది. అందుకే ప్రాంతాల వారీగా అభివృద్ధి, సాగునీటి సమస్యలపై ఆందోళన చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ బాధ్యతను ఆ పార్టీ నేతలకే అప్పగించారు. ప్రాజెక్టుల వారీగా ఆందోళనలు చేపట్టి టీడీపీ ఆ ప్రాంతాల్లో చెక్కు చెదరకుండా ఉండే ప్రణాళికను చంద్రబాబు రచించారు.

అభివృద్ధి ఏదీ?

ఉత్తరాంధ్రలో గత రెండున్నరేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదని, దీంతో పాటు ప్రాజెక్టులను కూడా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఇందుకు కార్యాచరణను ప్రకటించింది. ప్రాజెక్టుల వారీగా, జిల్లాల వారీగా ఆందోళనలను చేపట్టాలని నిర్ణయించింది. ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతామని టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు.

సీమ ఎడారిగా?

ఇదే మాదిరిగా రాయలసీమలోనూ ప్రాజెక్టుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీడీపీ చెబుతోంది. సీమ నేతలు ప్రత్యేకంగా సమావేశమై దీనిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా టీడీపీ నేతలు పర్యటనలు చేసి జగన్ ప్రభుత్వంపై దండెత్తడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద చంద్రబాబు మూడు రాజధానుల ఎఫెక్ట్ నుంచి పార్టీని బయటపడేసేందుకు స్థానిక సమస్యలను ఆధారంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News