టెన్షన్ లో చంద్రబాబు.. వారిపైనే కాన్సన్ ట్రేషన్

టీడీపీ అధినేత చంద్రబాబు లో టెన్షన్ ప్రారంభమయింది. సొంత సామాజికవర్గ నేతలే పార్టీని వీడుతుండటం చంద్రబాబులో కలవరం రేపుతోంది. అందుకే అమరావతి వచ్చిన వెంటనే చంద్రబాబు ఎమ్మెల్యేలను [more]

Update: 2020-05-31 08:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు లో టెన్షన్ ప్రారంభమయింది. సొంత సామాజికవర్గ నేతలే పార్టీని వీడుతుండటం చంద్రబాబులో కలవరం రేపుతోంది. అందుకే అమరావతి వచ్చిన వెంటనే చంద్రబాబు ఎమ్మెల్యేలను దువ్వే పనిలో పడ్డారంటున్నారు. పార్టీ కంటే ముందుగా ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే ఇప్పుడు చంద్రబాబు ముందున్న ప్రధమ కర్తవ్యం. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న ప్రచారం ఊపందుకుంది.

మరో ముగ్గురు మారితే…..

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కొనసాగాలంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు పార్టీలోనే కొనసాగాల్సి ఉంటుంది. మొత్తం 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వీరిలో వల్లభనేని వంశీ, కరణం బలరాం చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారే. మద్దాలిగిరి కూడా టీడీపీకి బై చెప్పేశారు. దీంతో మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న ప్రచారం చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

ఇద్దరు ఎమ్మెల్యేలు…..

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఆయన కొద్దిరోజుల్లోనే పార్టీని వీడే అవకాశముంది. ఇక రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా అదే బాటలో ఉన్నారంటున్నారు. ఆయన నాలుగైదు రోజుల్లో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అనగాని సత్యప్రసాద్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కానీ అనగాని సత్యప్రసాద్ మాత్రం తాను పార్టీని వీడేది లేదని చెబుతున్నా… జరుగుతున్న పరిణామాలు ఆయన పార్టీని వీడతారనే అంటున్నాయి.

విశాఖ జిల్లాలోనూ…..

ఇక విశాఖ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ సీనియర్ నేతలతో టచ్ లోకి వెళ్లారు. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సయితం అటు ఇటుగా ఉన్నారు. దీంతో నలుగురు పార్టీ మారితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోతుంది. అందుకే చంద్రబాబు ఇప్పుడు ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనే దృష్టిపెట్టారంటున్నారు. మహానాడుకు వీరు హాజరవుతారా? లేదా? అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడితే వీరికి ప్రత్యేక వర్గంగా స్పీకర్ ప్రకటించే అవకాశాలున్నాయి. మరి చంద్రబాబు వీరిన ఏవిధంగా కాపాడుకుంటారో చూడాలి.

Tags:    

Similar News