బాబు తొందర పడింది అందుకేనా? రీఎంట్రీతో ?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ లో చిక్కుకుపోవడంతో టిడిపి శ్రేణులు జిల్లాల్లో [more]

Update: 2020-05-26 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ లో చిక్కుకుపోవడంతో టిడిపి శ్రేణులు జిల్లాల్లో డీలా పడిపోయాయి. అడపాదడపా వీడియో కాన్ఫరెన్స్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ నిరసన కార్యక్రమాల్లో తమ్ముళ్ళు పాల్గొన్నా మునుపటి హుషారు ఏమాత్రం లేదు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలను పర్యవేక్షించే వారే కరువయ్యారు. అదే విధంగా ఇంటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు చేయాలని కోరడంతో ఎవరికి వారే మమ అనిపించి తమ తమ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసుకుని పని పూర్తి చేసేశారు.

చప్పగా , ఉప్పగా సాగిన కార్యక్రమాలు …

ఇలా చప్పగా, ఉప్పగానే టిడిపి కార్యక్రమాలు చేపట్టాలిసి వచ్చింది. ప్రజల్లో తిరగడం లేదా పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమాలు జరిపేందుకు అనుమతులు లేకపోవడం ప్రధాన ప్రతిపక్షానికి ఇబ్బందిగా మారింది. మద్యం, విద్యుత్ బిల్లులు లాంటి కీలక అంశాల్లో భారీ నిరసనలు చేపట్టాలిసిన కార్యక్రమాలు నామమాత్ర కార్యక్రమాలుగానే ముగించాల్సివచ్చింది. ఇప్పటికి ఇసుక సమస్య కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తీసుకువచ్చిన వెబ్ సైట్ సక్రమంగా ఓపెన్ కాక బహిరంగ మార్కెట్ కన్నా బ్లాక్ మార్కెట్ లోనే ఇసుక వినియోగదారుడికి చేరుతుంది. ఇలాంటి అంశాల్లో టిడిపి ప్రజల్లోకి చొచ్చుకుపోయే అవకాశాలు లాక్ డౌన్ దెబ్బకొట్టింది. ఇక విశాఖ గ్యాస్ దుర్ఘటన పై సైతం చంద్రబాబు బాధితుల పరామర్శకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడటం పార్టీకి మైనస్ గానే చెప్పాలి.

ముంచుకొస్తున్న మహానాడు …

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ మహోత్సవం మహానాడు క్యాడర్ కి దిశా దశ నిర్దేశం చేసే వేదిక. అయితే అదికూడా నేడు చంద్రబాబు అడుగు పెట్టేవరకు ఎలా చేపడతారో అర్ధం కాక పసుపు దళం కలవరపడుతుంది. దాంతో ఈ గందరగోళానికి చెక్ పెట్టి శ్రేణులను ఉత్తేజితం చేయాలిసిన తరుణం రావడం లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో అధినేత అమరావతి పయనం అయి వచ్చేశారు. ఇక ముందుగా అమరావతి కార్యక్షేత్రంగా చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ మొదలు కానున్నాయి. తొలిగా మహానాడు ను డిజిటల్ మహానాడుగా చంద్రబాబు ప్రారంభించి వైరస్ ప్రభావం ఉన్నా కొత్తగా నిర్వహించామని చాటనున్నారు. ఆ తరువాత గ్యాస్ బాధితుల పరామర్శ, టిటిడి భూముల అమ్మకం, విశాఖ, గుంటూరు లో సర్కార్ భూముల విక్రయాలు వంటి అంశాలపై పోరాటాలకు రూపకల్పన చేయనున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ కావడంతో బాటూ లాక్ డౌన్ లో బాగా విశ్రాంతి తీసుకున్న కొత్త చంద్రబాబు ఇప్పుడు దూకుడుగా రంగంలోకి దిగడం ఖాయమే అంటున్నారు తమ్ముళ్ళు. చూడాలి ఆయన కొత్త పాలిటిక్స్ ఎలా ఉంటాయో.

Tags:    

Similar News