అద్భుతం జరగాల్సిందే… లేకుంటే అదే గతి

తెలుగుదేశం పార్టీకి ఏపీలో ఇక చోటు ఉందా? వచ్చే ఎన్నికల్లోనైనా కనీస స్థానాలను అది చేజిక్కించుకుంటుందా? అంటే అనుమానమేనని చెప్పక తప్పదు. ఏడు పదుల వయసులో చంద్రబాబు [more]

Update: 2021-09-14 06:30 GMT

తెలుగుదేశం పార్టీకి ఏపీలో ఇక చోటు ఉందా? వచ్చే ఎన్నికల్లోనైనా కనీస స్థానాలను అది చేజిక్కించుకుంటుందా? అంటే అనుమానమేనని చెప్పక తప్పదు. ఏడు పదుల వయసులో చంద్రబాబు పార్టీని నడపటం కష్టమేనన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది. గతంలో చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ ఇప్పుడు లేదు. నాయకత్వపరంగానూ, అభివృద్ధి పరంగానూ చంద్రబాబు గత ఇరవైఏళ్లగా ఉన్న ఇమేజ్ ను 2014 పాలన తర్వాత పోగొట్టుకున్నారు.

నమ్మకం పోగొట్టుకుని….

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం త్వరతగతిన అభివృద్థి చెందుతుందన్న నమ్మకం ఉండేది. అయితే ఇప్పుడు ప్రజలలో ఆ నమ్మకం సన్నగిల్లింది. చంద్రబాబును గెలిపించినా లోకేష్ పెత్తనమే సాగుతుందన్న ప్రచారంతో పాటు అప్పులు చేసి చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారన్న ప్రశ్నకు కూడా సమాధానం దొరకని పరిస్థితి. గత ఎన్నికల్లోనే చంద్రబాబు చావు దెబ్బ తిన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఇబ్బంది పడ్డారు.

వేవ్ వచ్చే ఛాన్స్ లేదు….

ఈసారి వైసీపీ అన్ని రకాలుగా బలంగా ఉంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే… చంద్రబాబుకు జనంలో వేవ్ వచ్చే అవకాశం లేదు. సాధారణంగా ఒక వేవ్ వచ్చి ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుంది. గత ఎన్నికల్లో జగన్ కు వచ్చిన వేవ్ ఈసారి చంద్రబాబుకు లభించే ఛాన్స్ లు ఉండవు. పైగా తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం కూడా గణనీయంగా తగ్గింది. దశాబ్దకాలంగా పార్టీకి వెన్నంటి ఉంటున్న ఓటు బ్యాంకు సయితం కకా వికలమయింది.

మరోసారి గెలుపు అంటే…?

రాష్ట్ర విభజన తర్వాత తొలిముఖ్యమంత్రిగా గెలిచిన చంద్రబాబుకు అదే ఆఖరి అవకాశమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆయన సమర్థతపై నమ్మకం లేకపోవడం, చంద్రబాబును గెలిపించినా ప్రయోజనం లేదన్న అభిప్రాయం ఉండటంతో ఈసారి గతం కంటే సీట్ల సంఖ్య కొంత మెరుగుపడవచ్చేమో కాని గెలుపు అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చంద్రబాబు కు వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కడం కష్టమే.

Tags:    

Similar News