టీడీపీలో ఫుల్ సైలెంట్‌.. బాబుకు షాకా..? షేకా..?

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ వాతావ‌ర‌ణం ఒక్కసారిగా గుంభ‌నంగా మారిపోయింది. కీల‌క‌మైన నాయ‌కులు సరే.. మిగిలిన నేత‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు .. ఫుల్ సైలెంట్ అయిపోయారు. వాస్తవానికి [more]

Update: 2020-05-26 11:00 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ వాతావ‌ర‌ణం ఒక్కసారిగా గుంభ‌నంగా మారిపోయింది. కీల‌క‌మైన నాయ‌కులు సరే.. మిగిలిన నేత‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు .. ఫుల్ సైలెంట్ అయిపోయారు. వాస్తవానికి చంద్రబాబు ఏపీలోకి వ‌స్తున్నారంటే.. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి, ఆయ‌న‌కు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఆహ్వానం ప‌ల‌కాల‌ని పార్టీ నుంచి ఒక సందేశం వ‌చ్చింది. దీనికి విశాఖ‌లో ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, అనూ హ్యంగా విమానాలు ర‌ద్దు కావ‌డంతో చంద్రబాబు రోడ్డు మార్గంలో విజ‌య‌వాడ చేరుకున్నారు. దీంతో ఎక్కడ విశాఖ ప‌ర్యట‌న ర‌ద్దయింది. దీంతో అక్కడ ల‌క్ష‌లు పెట్టి చేసిన ఏర్పాట్లను మ‌ధ్యలోనే నిలిపి వేశారు.

అంతంత మాత్రంగానే…?

ఇక‌, విజ‌య‌వాడ‌లో ఎక్కడ ఏర్పాట్లు చేయాల‌నే విషయంపై నాయ‌కులు హ‌డావుడిగా నిర్ణయాలు తీసుకోలేక పోయారు. దీనికితోడు చంద్రబాబు అడుగు పెట్టే ప్రాంతాల‌న్నీ వైసీపీ అధీనంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయ‌లేక పోయారు. ఫ‌లితంగా అంతంత మాత్రంగానే చంద్రబాబు ఆహ్వానం ప‌ల‌కాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. ఇది నిజానికి చంద్రబాబు రేంజ్‌కు త‌గిన విధంగా లేద‌నే వాదన‌కు దారితీసింది. ఇదిలావుంటే, అత్యంత కీల‌క‌మైన ఘ‌ట్టం.. ఈ నెల 27 నుంచి మొద‌లు కానుంది.

దూరంగా ఉంటున్న వారు….

పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మ‌హానాడును ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించాల‌ని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే దీనిని నిర్వహించేందుకు జూమ్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించా ల‌ని నిర్ణయించుకున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్రతి జిల్లాలోనూ టీడీపీ నేత‌లు ఇప్పుడు వైసీపీ తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు. గ‌తంలో వారు చేసుకున్న ప‌నుల‌తో కేసులు న‌మోద‌య్యా యి. దీంతో ఎక్కడ అరెస్ట్ చేస్తారోన‌నే భ‌యంతో నాయ‌కులు వైసీపీకి సానుకూలంగా ఉన్నారు. అందుకే చంద్రబాబు పిలుపు నిచ్చిన కార్యక్రమాల‌కు కూడా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.

వారు పాల్గొనే అవకాశం…..

జ‌గ‌న్ ప్రభుత్వంపై ప‌న్నెత్తు మాట కూడా అన‌డం లేదు. మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి నాయ‌కులు రాజ‌ధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మ‌రికొంద‌రు ఇప్పటికే టీడీపీకి రాంరాం చెప్పారు. ఇప్పుడు ఇలాంటి వారు మ‌హానాడులో పాల్గొంటారా? పాల్గొన్నా.. వైసీపీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాల్సి వ‌స్తే.. చేస్తారా? చ‌ంద్రబాబుకు మ‌ద్దతు ప‌లుకుతారా? అనేది ప్రధాన స‌మ‌స్యగా మారింది. పైగా ఏ చిన్న తేడా వ‌చ్చినా.. కేసుల్లో చిక్కుకోవ‌డం గ్యారెంటీ అనే ప్రచారం జ‌రుగుతోంది. ఈ ప‌రిణామం.. చంద్రబాబును క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News