బాబు టూర్లకు ఆయన తలపోటు అవుతున్నాడా …?

కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏపీ లో విపక్ష నేత చంద్రబాబు దూకుడు పెంచారు. అధికారపక్షానికి వ్యతిరేకంగా పోరాటాలు, పరామర్శలు ఇలా ఆయన ఎదో ఒక కార్యక్రమంలో ఉంటున్నారు. [more]

Update: 2021-07-30 03:30 GMT

కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏపీ లో విపక్ష నేత చంద్రబాబు దూకుడు పెంచారు. అధికారపక్షానికి వ్యతిరేకంగా పోరాటాలు, పరామర్శలు ఇలా ఆయన ఎదో ఒక కార్యక్రమంలో ఉంటున్నారు. జూమ్ బాబు గా ఇన్నాళ్ళు వైసిపి నేతలు చేసిన చేస్తున్న విమర్శలకు తన టూర్స్ తో చెక్ పెట్టాలన్న పట్టుదల సైకిల్ పార్టీ అధినేత. ఇదంతా బాగానే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబుకు ఇష్టం లేని స్లోగన్ ఒకటి ప్రతీ చోటా చర్చనీయంగా మారింది.

జూనియర్ రావాలిసిందే …

తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేనంత డీలా పడివుంది. జగన్ పార్టీ గత ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకు కొట్టిన దెబ్బలతో ఐసీయూ లో చేరినట్లు మూలన పడింది ఆ పార్టీ. అయితే రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. జీరో నుంచి తిరిగి అధికారం దిశగా ఎదిగిన పార్టీలు చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. ఆ విశ్వాసం తోనే చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని పార్టీ కి పూర్వ వైభవానికి శ్రీకారం గట్టిగానే చుట్టారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటనలకు జూనియర్ ఎన్టీఆర్ రావాలి పార్టీని కాపాడాలి అంటూ కొందరు చేస్తున్న అల్లరి తలపోటుగా పార్టీకి మారింది. వారి నినాదాల వల్ల ప్రస్తుతం నష్టం ఏమి లేకపోయినా ప్రజల్లో మాత్రం పసుపు పార్టీలో చంద్రబాబు పనైపోయిందనే సంకేతాలు వెళ్ళడం, చర్చ జరగడం ప్రత్యర్థుల లక్ష్యంగా కనిపిస్తుంది.

లోకేష్ ను వీక్ చేయడానికేనా ?

తెలుగుదేశం పార్టీ భావి వారసుడు నారా లోకేష్. ఇందులో పార్టీ శ్రేణుల్లో ఏమాత్రం అస్పష్టత లేదు. అయితే స్వయానా లోకేష్ మంగళగిరి లో ఓటమి చెందడంతో ఆయన నాయకత్వంపై పార్టీ క్యాడర్ లో పూర్తి స్థాయి విశ్వాసం లేకుండా పోయింది. స్వయంగా అచ్చెన్నాయుడే ఒక వీడియో లో లోకేష్ సరిగ్గా ఉంటే పార్టీకి గతి ఇలా ఎందుకు ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేసినప్పుడు చంద్రబాబు తరువాత వారసులు ఎవరన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా నడిచింది. కట్ చేస్తే తిరుపతి ఎన్నికల తరువాత కరోనా సెకండ్ వేవ్ టిడిపి ఆన్లైన్ యాక్టివిటీ కే పరిమితం కావడం ఇప్పుడు కేసులు తగ్గాకా చంద్రబాబు స్పీడ్ కావడంతో ఇప్పుడిప్పుడే పార్టీ గాడిన పడుతుంది అనుకున్న సమయంలో జూనియర్ గోల టిడిపి అధినాయకత్వం చెవిలో జోరీగలా మారింది.

ఇద్దరు లాభం లేదా …?

వాస్తవానికి చంద్రబాబు తరువాత ఆయన స్థానం భర్తీ చేసే వారు టిడిపి లో కనుచూపు మేరలో కానరావడం లేదు. 2009 లో జూనియర్ ఎన్టీఆర్ సుడిగాలి పర్యటనలు చేసినా ఏమాత్రం ఫలితం కానరాలేదు. అలాంటిది ఇప్పుడు ఆయన పార్టీకి నేతృత్వం వహించినా జగన్ చరిష్మా ను ఎదుర్కోవడం చిన్న విషయం కాదు. అటు ప్రత్యక్ష ఎన్నికల్లో ఫెయిల్ కావడంతో లోకేష్ గత ట్రాక్ రికార్డ్ పరంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ లు తెలుగుదేశానికి పూర్వవైభవం తెచ్చే దమ్మున్నవారు కారన్నది ఆ పార్టీలోనే ఒక అపనమ్మకం. మరి చంద్రబాబు ను పక్కన పెడితే తెలుగుదేశం నావకు చుక్కాని ఎప్పుడు లభిస్తారో చూడాలి.

Tags:    

Similar News