నో.. ఆ పని చేయరు….ఎందుకంటే ఆయన చంద్రబాబు

రాజకీయాల్లో దూరదృష్టితో ఆలోచించే వారే ఎక్కువ కాలం మనగలుగుతారు. అందులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు వరసలో ఉంటారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి గురించి కాదు తన [more]

Update: 2021-07-29 08:00 GMT

రాజకీయాల్లో దూరదృష్టితో ఆలోచించే వారే ఎక్కువ కాలం మనగలుగుతారు. అందులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు వరసలో ఉంటారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి గురించి కాదు తన కుటుంబం, పార్టీ గురించి కూడా దూరదృష్టితో ఆలోచిస్తారు. అధికారం కోసం ఎవరినైనా వదులుకునేందుకు సిద్ధపడతారు. ముప్పు ఉందని తెలిస్తే వారిని ముందుగానే తీసిపారేస్తారు.

అధికారంలోకి వచ్చిందే…?

అసలు చంద్రబాబు అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుంది అలాగే. అప్పట్లో తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును అధికారంలోకి వచ్చేంత వరకూ ఉపయోగించుకుని ఆ తర్వాత నెట్టి పారేశారు. బాబు దెబ్బకు దగ్గుబాటి రెండు దశాబ్దాల నుంచి రాజకీయంగా కోలుకోలేకపోయారు. ఇక హరికృష్ణ కూడా పార్టీ లో తన తర్వాత అడ్డు వస్తారని భావించి ఆయనను పక్కన పెట్టేశారు.

క్యాడర్ కోరుతున్నా…?

అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకొచ్చి కొరివితో తలగోక్కుంటారా? అన్న ప్రశ్నను ఎవరిని అడిగినా లేదనే సమాధానం వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ క్యాడర్ రెచ్చిపోయే కొద్దీ చంద్రబాబు ఆ ఫ్యామిలీని మరింత దూరం చేస్తారన్నది వాస్తవం. అందరూ కోరినట్లు, కోరుతున్నట్లు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తెచ్చి పదవులు ఇచ్చి నెత్తిమీద కూర్చోబెట్టుకునే ప్రస్తకి లేదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే.

ప్రచారం వరకూ ఓకే….?

కాని ఎన్నికల సమయానికి జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించే కార్యక్రమానికి మాత్రం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తే చేయవచ్చు. ఎందుకంటే అది తనకు ఉపయోగం. జూనియర్ ఎన్టీఆర్ ను కేవలం ప్రచార రధానికే పరిమితం చేస్తారు తప్పించి పార్టీ పదవులు ఇచ్చే అవకాశం లేదు. అయితే తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి జూనియర్ వస్తారా? రారా? అన్నది ఆయనే తేల్చుకోవాలని చంద్రబాబు అన్నా అనవచ్చు. మొత్తం మీద చంద్రబాబు క్యాడర్ ఎంత గగ్గోలు పెట్టినా జూనియర్ విషయంలో ఎటువంటి వత్తిళ్లకు లొంగరు. ఎందుకంటే ఆయన చంద్రబాబు.

Tags:    

Similar News