బాబు మిస్ చేసుకుంటున్న బంపర్ ఆఫర్లు ?

సింహా సినిమాలో బాల‌య్య ఫేమ‌స్ డైలాగ్‌ను చంద్రబాబు ఇప్పుడు బాగా ఫాలో అవుతోన్న ప‌రిస్థితి ఉంది. చంద్రబాబు ఎంతసేపూ ఒక వైపే చూస్తున్నారు. రెండవ వైపే ఆయన [more]

Update: 2021-09-20 15:30 GMT

సింహా సినిమాలో బాల‌య్య ఫేమ‌స్ డైలాగ్‌ను చంద్రబాబు ఇప్పుడు బాగా ఫాలో అవుతోన్న ప‌రిస్థితి ఉంది. చంద్రబాబు ఎంతసేపూ ఒక వైపే చూస్తున్నారు. రెండవ వైపే ఆయన అసలు చూడను అంటున్నారు. ఆయన చూపు జగన్ మీదనే ఉంది. సమస్య ఏదైతేనేం, అది ఎక్కడ ఉంటేనేం. జగన్ కి ముడి పెట్టి విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. దాంతో పొలిటిక‌ల్ సీన్ భారీగా తేడా కొడుతోంది. రాజకీయం ఎక్కడా కూడా జోరందుకోవడంలేదు. జనాలకు కూడా ప్రతిప‌క్షం ప‌ట్ల విశ్వాసం పెరగడంలేదు. ఎన్నో ప్రజా సమస్యలు ప్రస్తుతం ఉన్నాయి. కరోనా రెండు దశల తరువాత రాష్ట్రంలో నిరుద్యోగం దారుణంగా పెరిగింది. అలాగే రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం కావడం వంటివెన్నో ఉన్నాయి.

రొటీన్ స్పీచ్ లతో…?

సామాన్యుల‌కు ఇసుక ఇక్కట్లు మామూలుగా లేవు. జ‌గ‌న‌న్న ఇళ్ల విష‌యంలో ప్రభుత్వం మాట మార్చడంతో ఎంతో మంది ర‌గులుతున్నారు. అలాగే కేంద్రం విభజన హామీల విషయంలో ఏ మాత్రం పట్టనట్లుగా ఉంటోంది. పోలవరానికి సవరించిన నిధులకు ఆమోదముద్ర వేయడంలేదు. ఇలా ఎన్నో సమస్యలు బీజేపీతో సంబంధం కలిగి ఉన్నా కూడా వాటిని ఎత్తడానికే చంద్రబాబు అసలు ఇష్టపడడంలేదు. ఇపుడు వీటి మీద ఆందోళన చేస్తే జనాల్లో వచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. జనాలు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మీద విసిగి ఉన్నారు. అయితే జగన్ తో పాటు మోడీనికి కూడా విమర్శించడానికి చంద్రబాబు తయారుగా ఉండాలి. అంతే తప్ప దేశంలోని సమస్యలు అన్నింటికీ జగనే కారణమంటూ రొటీన్ స్పీచులు ఇస్తే మాత్రం జనాలు ఆయన పోరాటంలోని చిత్తశుద్ధిని ఎండగడతారు.

ఆ ముద్ర ఇప్పటికే…?

ఇప్పటికే అవుట్ డేటెడ్ చంద్రబాబు అన్న ముద్ర ఆయ‌న‌పై వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు చంద్రబాబు పేరు త‌ల‌చుకునేందుకు కూడా జ‌నాలు ఇష్టప‌డ‌రు. మరో వైపు చూస్తే ఏపీలో ధరలు దారుణంగా పెరిగిపోయాయి. ప్రజల జీవన ప్రమాణాలు కూడా బాగా పడిపోయాయి. కూరగాయల దగ్గర నుంచి పప్పు దినుసుల దాకా, అలాగే వంట నూనెల దగ్గర నుంచి ఇతర అవసరాల దాకా అన్ని రకాలైన ధరలు నింగిని అంటాయి. సచివాల‌య నియామ‌కాల త‌ర్వాత ఉన్నత ఉద్యోగాల‌కు సంబంధించి ఏ నోటిఫికేషన్లు లేవు. నిరుద్యోగం దారుణంగా ఉంది.ఎక్కడా పనులు లేవు, ఎవరి చేతిలో రూపాయి ఆడటంలేదు.

జూమ్ మీటింగ్ లో…..

ఈ సమయంలో చంద్రబాబు కనుక జిల్లాల టూర్లు స్టార్ట్ చేస్తే ఖ‌చ్చితంగా టీడీపీకి మంచి పొలిటికల్ మైలేజ్ వస్తుంది. ప్రజలు కూడా మండుతున్న తమ గుండెలకు అండగా నిలిచే వారి కోసం ఎదురు చూస్తున్నారు. మరి చంద్రబాబు అటు వైసీపీని, ఇటు బీజేపీకి కలిపి కట్టి ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారా అన్నదే అతి పెద్ద డౌట్. గ్రౌండ్ ఖాళీగా ఉంది, దూకేయ్ బాబూ అంటోంది. మ‌రి చంద్రబాబు జూమ్ మీటింగ్‌లో జాయ్ అంటూ కాలం గడిపేస్తున్నారు.

Tags:    

Similar News