“రాజు” గారిపైనే బాబు ఆశలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. జగన్ కు, బీజేపీకి మధ్య సంబంధాలు చెడిపోవాలని ఆయన గట్టిగా భావిస్తున్నారు. దీంతో ఆయన ప్రయత్నాలు [more]

Update: 2021-07-23 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. జగన్ కు, బీజేపీకి మధ్య సంబంధాలు చెడిపోవాలని ఆయన గట్టిగా భావిస్తున్నారు. దీంతో ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చంద్రబాబు బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుంది. లేకపోతే జగన్ దెబ్బకు పార్టీ అన్ని విధాలుగా దెబ్బతింటుంది. వీలయినంత త్వరగా బీజేపీతో కలసి నడవాలన్నది చంద్రబాబు ఆలోచన.

మరో మూడేళ్లు…..

ఇక ఎన్నికలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. 2024లోనే ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికలు రావు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ మూడేళ్లలో తాము ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండాలన్నా, జగన్ ప్రభుత్వం వేధింపుల నుంచి బయటపడాలన్నా బీజేపీ మద్దతు అవసరం. కానీ బీజేపీ పెద్దలు మాత్రం జగన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. వారు జగన్ తో సఖ్యతగా ఉండటమే మేలని భావిస్తున్నారు.

బాబుతో కలసి నడిచేందుకు…..

చంద్రబాబు తో అనేకసార్లు కలసి నడచి వెళ్లినా పార్టీని నమ్మించి మోసం చేశారన్నది బీజేపీ పెద్దల భావన. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయా? రావా? అన్నది డౌటే. అందుకే చంద్రబాబు కంటే జగన్ మద్దతే తమకు అవసరం ఉంటుందని బీజేపీ ఢిల్లీ పెద్దల ఆలోచన. అందుకే చంద్రబాబును దగ్గరకు రానివ్వడం లేదు. అయితే చంద్రబాబు మాత్రం వైసీపీకి, ఢిల్లీ పెద్దలకు మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

రాజు వ్యవహారంలోనే..?

రఘురామ కృష్ణరాజు అంశంలో ఇద్దరికీ చెడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. రాజుపై చర్యలు తీసుకోకుంటే వైసీపీ మరింత దూరం అవుతుందన్నది చంద్రబాబు అంచనా. అందుకే తనకు తెలిసిన నేతలతో రఘురామ కృష్ణరాజుకు అనుకూలంగా చంద్రబాబు రాజకీయం నడుపుతున్నారు. ఇద్దరికీ రాజు గారి విషయంలో చెడుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అదే జరిగితే చంద్రబాబు బీజేపీకి దగ్గరవ్వడానికి మార్గం సుగమమవుతుంది.

Tags:    

Similar News