అన్న వచ్చేస్తున్నాడు…. మళ్లీ నువ్వే రావాలి చంద్రన్నా?

ఈ ప్రకృతి ఏమిటి పగ బట్టినట్టు ఇలా వ్యవహరిస్తోంది. రెండు నెలలు అయ్యింది ఆయన్ని చూసి. ఇంత కష్ట పడి ప్లాన్ చేస్తే. ఆ విమానాలు కాస్తా [more]

Update: 2020-05-25 03:30 GMT

ఈ ప్రకృతి ఏమిటి పగ బట్టినట్టు ఇలా వ్యవహరిస్తోంది. రెండు నెలలు అయ్యింది ఆయన్ని చూసి. ఇంత కష్ట పడి ప్లాన్ చేస్తే. ఆ విమానాలు కాస్తా అలా అయ్యాయి…. అదే ఆ రోజుల్లో…! చదివే వారితో పాటు ఆయన కూడా ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోతే……(ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చక్రం ఎవరికి వారే తిప్పాలి).

తెల్లవారు జామునుంచే….

అదిగో వచ్చేస్తున్నాడు….. అని ఉదయం 5.55కి బులెటిన్ మొదలయ్యేది….. మిగతా వాళ్ళకంటే మేమే ముందు ఇచ్చాం అని, బీట్ రిపోర్టర్ లు ఆయనకు తర్వాత కథలు కథలుగా చెప్పాలి. కాబట్టి ఆ లింక్ లు వెంటనే అప్లోడ్ చేస్తారు…. ఓ బ్యాంగ్, హాఫ్ బీజీ, ఫుల్ బీజీ ముందే రెడీ అవుతాయి. ఉదయం 7 గంటలకే ఇంటికి హైదరాబాద్ లో బయలు దేరుతారు కాబట్టి…. 5.30కే గరికపాడులో 5వేల మందితో టీడీ, తాతయ్య బ్యాచ్ డప్పు కొడుతూ రెడీగా ఉంటారు. మన ఉమ కూడా అక్కడే అటు ఇటు తిరుగుతూ కిచకిచలాడుతూ ఉంటారు. ఎక్కడ లైవ్ నడుస్తుంటే అక్కడే మైక్ వదలకుండా జనాన్ని విసిగిస్తూ షో నడుస్తుంది. మధ్యాహ్నం 11.30వరకు ఈ హంగామా ఇలా సాగుతుండగా కోదాడ దాటగానే కాన్వాయ్ స్లో అయ్యిద్ది….. అప్పటి దాకా లైవ్ లలో కనిపించే ఉమ, ఎవరికి కనబడకుండా ఓ 500మందితో జిల్లా దాటేసి ఎదురెళ్లి కోలాటంతో కాన్వాయ్ ని 1.30వరకు జిల్లాలోకి రానివ్వకుండా ప్లాన్ చేసి….. జస్ట్ ఇలా వచ్చి అలా మాయమైపోయే ప్లాన్ ప్లే చేస్తారు.

శోకాలు తప్పని సరి….

దీంతో ఖంగు తినే జగ్గయ్యపేట బ్యాచ్, మీడియా జనం లైవ్ వ్యాన్ లతో కాన్వాయ్ వెంట పడి నందిగామలో తెలుతారు…. అక్కడి నుంచి ఇంటికి బ్యారేజ్ దగ్గరకొచ్చేసరికి బుద్దా వెంకన్న కొరడతో కొట్టుకుంటూ డాన్స్ వేస్తూ ఉంటాడు. మధ్యలో జనం శోకాలు పెట్టి ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్ళావు బాబయ్యా అని ఏడుస్తూ ఉంటారు. ఇంకో వైపు నాయకుడా., జయము జయము చంద్రన్న పాటలు వినిపిస్తూ ఉంటాయి. బ్యారేజ్ మీద ఇరుక్కుపోయిన ఉండవల్లి జనం బూతులు ఎవరికి వినిపించవు. ఇంతలో ముఖాన నీళ్లు చల్లి ఇంటికి వెళ్లడం కుదరదట…. పెయిడ్ క్వారంటయిన్ అంటున్నారు అని సెక్రటరీ చెప్పగానే…. నో నో నో…. వాట్ ఐ యమ్ సేయింగ్….. అంటుండగానే…… నథింగ్ డూయింగ్….. 14రోజులు సెల్ఫ్ క్వారంటయిన్ స్టాంప్ వేసేశారు.

Tags:    

Similar News