చంద్రబాబు వచ్చేస్తున్నారు.. అనుమతి ఇస్తారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరుతున్నారు. సోమవారం ఆయన నేరుగా విశాఖపట్నంకు చేరుకోనున్నారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులను చంద్రబాబు పరామర్శిస్తారు. ఈ మేరకు [more]

Update: 2020-05-24 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరుతున్నారు. సోమవారం ఆయన నేరుగా విశాఖపట్నంకు చేరుకోనున్నారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులను చంద్రబాబు పరామర్శిస్తారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల డీజీపీలకు చంద్రబాబు లేఖ రాశారు. ఈ మేరకు ఆన్ లైన్ లో చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం చంద్రబాబుకు వెంటనే అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు.

రెండు నెలల లాక్ డౌన్ తర్వాత….

రెండు నెలల లాక్ డౌన్ సమయంలో చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా ఆయన హైదరాబాద్ లో తన ఇంటికే పరిమితమయ్యారు. అయితే సోమవారం తాను విశాఖ వెళ్లదలచుకున్నానని, అందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డీజీపీలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 20వ తేదీన చంద్రబాబు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చారు.

అనుమతి కోసం..

చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నా పార్టీ కార్యక్రమాలను జూమ్ యాప్ ద్వారా టచ్ లోనే ఉన్నారు. పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రావాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఏపీ మంత్రులు ప్రకటన చేశారు. ఇది లాక్ డౌన్ నిబంధన అని వారు స్పష్టం చేశారు. దీంతో పాటు విశాఖ వెళ్లేందుకు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని కార్యాలయానికి కూడా లేఖ రాశారు. అయితే కేంద్ర హోంశాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన విశాఖ పర్యటన చేయలేక పోయారు.

విశాఖ పర్యటన కావడంతో….

చంద్రబాబు నేరుగా విశాఖ పర్యటనకు అనుమతి కోరడంతో ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. విజయవాడకు అయితే అనుమతి ఇచ్చే వారు. విశాఖ పర్యటన కావడంతో కొంత సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు విశాఖ పర్యటనను ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు పరామర్శ కావడంతో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏపీ పర్యటనకు ప్రభుత్వం అనుమతిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News