బాబు ఊహించని నిర్ణయం.. ఏడాది ముందుగానే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి క్విక్ డెసిషన్ తీసుకోపోతున్నారు. ఆయన ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నేతలను సమాయత్తం చేయాలని నిర్ణయించారు. అభ్యర్థులను ఏడాది [more]

Update: 2021-06-30 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి క్విక్ డెసిషన్ తీసుకోపోతున్నారు. ఆయన ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నేతలను సమాయత్తం చేయాలని నిర్ణయించారు. అభ్యర్థులను ఏడాది ముందుగానే ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాలకు ఒక్కే సారి అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

లెక్కలను పక్కన పెట్టి….

చంద్రబాబు నాయుడు ఎప్పుడు అన్నీ లెక్కలు వేసుకుని మరీ అభ్యర్థులు ప్రకటిస్తారు. అయితే ఈసారి అన్ని లెక్కలను పక్కన పెట్టి ఏడాది ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలన్న ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల సీనియర్ నేతలతో మాట్లాడినప్పుడు తన మనసులో మాటను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వల్ల అడ్వాంటేజీ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.

ఏడాది ముందుగానే…?

ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలకు ఏడాది ముందు అభ్యర్థులను ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో పాత నేతలే మళ్లీ అభ్యర్థులవుతారు. కొత్త నేతలకు అవకాశం ఇచ్చి చేతులు కాల్చుకోవడం ఎందుకన్నది చంద్రబాబు ఆలోచన. ఈ ప్రయోగం ఈ ఎన్నికల్లో చేయకూడదని, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది.

ఇప్పటికే కొందరికి…?

ఇప్పటికే కొందరు ముఖ్యమైన నేతలకు ఫోన్లు చేసి అభ్యర్థిగా ఇప్పటి నుంచే ప్రచారం చేసుకోవచ్చని కూడా చంద్రబాబు కొందరు నేతలకు సూచించినట్లు చెబుతున్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించారు. పాత సంప్రదాయానికి ఈసారి చెక్ పెట్టి ఒకేసారి అందరు అభ్యర్థులను ఏడాది ముందుగానే ప్రకటించి 2024 ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. మరి అది సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News