అందుకే నమ్మడం లేదు.. రివైండ్ చేస్తే దొరికిపోతున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలపై విశ్వాసం కోల్పోయింది అందుకే. ఆయన ఎప్పుడూ ఒక మాట మీద నిలబడరు. తనకు రాజకీయంగా ఉపయోగపడే అంశంగా భావిస్తే గతంలో తీసుకున్న [more]

Update: 2020-05-23 08:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలపై విశ్వాసం కోల్పోయింది అందుకే. ఆయన ఎప్పుడూ ఒక మాట మీద నిలబడరు. తనకు రాజకీయంగా ఉపయోగపడే అంశంగా భావిస్తే గతంలో తీసుకున్న నిర్ణయాల విషయాన్ని కూడా చంద్రబాబు ఏ మాత్రం ఆలోచించరు. ప్రజలు ఏమనుకుంటారో అని కూడా భావించరు. అందుకే చంద్రబాబు మాటలను ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. 2014 నుంచి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు యూటర్న్ లు తీసుకోవడం వల్లనే ఆయనకు గత ఎన్నికల్లో ఘోర ఓటమి లభించిందంటారు.

రాష్ట్రంలోకి రానిచ్చేది లేదంటూ….

ముందుగా సీబీఐని తీసుకుంటే… అప్పటి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేక చంద్రబాబు సీబీఐని దరిదాపుల్లోకి రానిచ్చేది లేదని చెప్పారు. సీబీఐని రాష్ట్రం లోకి రానివ్వకుండా ఉత్తర్వులు కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకునే సీబీఐపై తమకు నమ్మకం లేదని చంద్రబాబు పదే పదే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తమకు ప్రత్యర్థులైన రాజకీయ పార్టీలపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తుందన్నారు. అందుకే సీబీఐ, ఈడీలను రాష్ట్రంలోకి రానివ్వడం లేదని, ఐదు కోట్ల ప్రజలకు అవమానం కల్గించేలా సీబీఐ ప్రయత్నిస్తుందని చంద్రబాబు అప్పట్లో ఆరోపించారు.

ఢిల్లీలో జాతీయ మీడియాతోనూ….

చంద్రబాబు తర్వాత పశ్చిమ బెంగాల్ లోనూ సీబీఐ రాష్ట్రంలోకి రానివ్వకుండా మమత బెనర్జీ జీవో జారీ చేశారు. సీబీఐ, ఈడీల దాడులపై ఢిల్లీ వెళ్లి చంద్రబాబు పోరాటం చేశారు. అక్రమ కేసులను బనాయిస్తూ తమ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తుంనదని ఢిల్లీలో అనేక సార్లు జాతీయ మీడియా ఎదుట వాపోయారు. అయితే అధికారంలో నుంచి దిగిపోయిన వెంటనే చంద్రబాబుకు సీబీఐ మంచిదయింది.

సీబీఐ ఇప్పుుడు మంచిదయిందా?

డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో వాస్తవ విషయాలు బయటపడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంటే సీబీఐపై చంద్రబాబుకు అంత నమ్మకం ఏర్పడిందన్నమాట. అధికారంలో ఉన్నప్పుడు పనికిరానిది అన్న సీబీఐని చంద్రబాబు ఇప్పుడు నెత్తికెక్కంచుకోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబు విశ్వసనీయత కోల్పోవడానికి యూటర్న్ లు ఎక్కువగా తీసుకోవడమే కారణమంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News