వైసీపీయే చంద్రబాబు మైలేజీ పెంచుతుందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అన్ని రకాలుగా కష్టాల్లో ఉన్నారు. పార్టీ నేతల సహకారం కొరవడటం, వరస అపజయాలు ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే [more]

Update: 2021-05-12 05:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అన్ని రకాలుగా కష్టాల్లో ఉన్నారు. పార్టీ నేతల సహకారం కొరవడటం, వరస అపజయాలు ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు వైసీపీయే ఎక్కువ మైలేజీ ఇస్తున్నట్లుంది. చంద్రబాబు వల్లనే వ్యాక్సినేషన్ కోసం ఆసుపత్రుల వద్ద బారులు తీరారని వైసీపీ నేతలు చెప్పడం ఖచ్చితంగా ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుంది.

వ్యాక్సిన్ పైనే…?

చంద్రబాబు వ్యాక్సినేషన్ పైనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. అది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని తెలిసినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు పదే పదే వ్యాక్సినేషన్ విషయంలో వైసీపీ విఫలమయిందని విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిని పెద్దగా పట్టించుకోకుండా ఉండి ఉంటే వైసీపీకి గౌరవంగా ఉండేది. కానీ చంద్రబాబు చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం ఆయనకే అనుకూలంగా మారింది.

క్యూ కడుతున్నారంటే?

చంద్రబాబు మాటలు విని జనం వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారంటే ప్రజల్లో ఆయన మాటకు విలువ ఉన్నట్లే కదా? జగన్ నుంచి మంత్రుల వరకూ వ్యాక్సిన్ తమ పరిధిలో లేదని చెబుతున్నా జనం వాటిని పట్టించుకోవడం లేదన్న మాటేగా? ఇదే ప్రస్తుతం వైసీపీలో చర్చ జరుగుతుంది. చంద్రబాబు వ్యాక్సినేషన్ విషయంలో ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని తెలిసినా ఆయన ట్రాప్ లో వైసీపీ నేతలు పడిపోయారనే అనిపిస్తుంది.

ట్రాప్ లో పడిపోయి….

దీంతో చంద్రబాబు మరింతగా వ్యాక్సినేషన్ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఇది కనీస పరిజ్ఞానం ఉండే వారికి ఎవరికైనా తెలుసు. కానీ చంద్రబాబు పదే పదే అదే విమర్శలు చేస్తున్నారంటే ఆయనకు తెలియక కాదు. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలనే ఉద్దేశ్యమే. అది వదలేసి వైసీపీ నేతలు చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆయనపై కేసులు నమోదు చేస్తుండటంతో వైసీపీ ఖచ్చితంగా చంద్రబాబుకు పోయిన ఇమేజ్ ను తెచ్చిపెడుతుందనే చెప్పాలి.

Tags:    

Similar News