ఏడేళ్ళ కోరిక ఈడేరేనా ?

చంద్రబాబు చేతిలో నాడు అధికారంలో లేదు. పైగా తాను నిత్యం ద్వేషించే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీలో జగన్ రూపంలో ముసలం పుట్టింది. వైఎస్సార్ [more]

Update: 2021-06-19 00:30 GMT

చంద్రబాబు చేతిలో నాడు అధికారంలో లేదు. పైగా తాను నిత్యం ద్వేషించే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీలో జగన్ రూపంలో ముసలం పుట్టింది. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి జగన్ ఒక కొరకరాని కొయ్య అయ్యాడు. నిజంగా అది వారి సొంత పార్టీ సమస్య. చంద్రబాబుకు ఏ మాత్రం సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు జగన్ మీద కోర్టులో పిటిషన్ వేస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఇంప్లీడ్ అయింది. జగన్ అక్రమాస్థుల కధ తేల్చమని గట్టిగా కోరింది. ఆ తరువాత జరిగిన పరిణామాలు, చంద్రబాబు నేర్పరితనం వెరసి జగన్ ని పదహారు నెలలపాటు జైలు పాలు చేశాయి. ఆ మీదట జగన్ 2013 సెప్టెంబర్లో బెయిల్ తీసుకుని జైల్ నుంచి విడుదల అయ్యారు.

అదే కదా టార్గెట్….

ఇక 2014 ఎన్నికల నాటికి జగన్ సీన్ లో ఉండకూడదు అనుకుంటే జగన్ అనూహ్యంగా విడుదల కావడమే కాకుండా టీడీపీ గెలుపునే సవాల్ చేశారు. దాంతో ఎత్తుకు పై ఎత్తు వేసిన చంద్రబాబు ఈసారి బీజేపీతో, సినీ నటుడు పవన్ తో జతకట్టి జగన్ని ఎదుర్కొన్నారు. ఆయన్ని ప్రతిపక్షానికే పరిమితం చేశారు. తాను అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో బీజేపీ కూడా పవర్ లోకి వచ్చింది. అప్పట్లో అంతా ఒక్కటే మాట అనేవారు. చంద్రబాబు వచ్చారు కాబట్టి జగన్ కి మళ్ళీ జైలు జీవితమే ప్రాప్తమని. కానీ చంద్రబాబు అయిదేళ్ళలో 29 సార్లు ఢిల్లీ వెళ్ళారు కానీ జగన్ మాత్రం జైలుకు వెళ్ళలేదు.

ఈసారీ షాకే ….

జగన్ లేకుండా 2019 ఎన్నికలకు వెళ్ళాలని చంద్రబాబు గట్టిగా తలచినా మళ్లీ నిరాశే ఎదురైంది. పైగా బంపర్ మెజారిటీతో జగన్ గెలిచి చంద్రబాబుకి దారుణమైన ఓటమిని చవి చూపించారు. బీజేపీతో పొత్తు కానీ ఒక మెట్టు దిగి మోడీతో చేసిన స్నేహం కానీ జగన్ ని జైలులో పెట్టించలేకపోయాయి అన్న వేదన అయితే బాబులోనూ తమ్ముళ్ళలోనూ ఇప్పటికీ అలాగే మిగిలే ఉంది. జగన్ సీఎం అవడూ అనుకుంటే అయిపోయాడు. సునాయాసంగా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశాడు. మరి జగన్ జైలు ఈ రెండింటినీ ముడి పెట్టడం ఎలా ఇదే ఇపుడు టీడీపీలోనూ చర్చగా ఉందిట.

ముచ్చటగా మూడవసారి ….

జగన్ విషయంలో ఎపుడూ టీడీపీ తన చేతులకు మట్టి అంటకుండానే కధ నడిపిస్తూ వస్తోంది. ఈసారి కూడా అదే జరుగుతోందా అన్నదే చర్చ. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేశారు. దాని మీద ఏం జరుగుతుంది అన్నదే ఆసక్తిని కలిగించే అంశం. ఏడాదిన్నరగా జగన్ కోర్టుకు హాజరు కావడంలేదు, ఇక ఆయన బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వస్తే కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని సీబీఐ కోరడాన్ని కూడా అంతా కొత్తగా చూస్తున్నారుట. మరో వైపు చూస్తే జగన్ బెయిల్ రద్దు అవుతుందని, జైలుకు ఇప్పటికిపుడు వెళ్తాడు అని ఎవరూ భావించడంలేదు. దాని వెనక చాలా కారణాలు ఉన్నాయి. మరి జగన్ని జైలుకు పంపితేనే వైసీపీ వీక్ అవుతుంది. అపుడు ఏపీ రాజకీయం తమకు అనుకూలం అవుతుంది అన్న చంద్రబాబు కోరిక తీరేదెలా?

Tags:    

Similar News