పరువు తీస్తున్నారే? బజారు కీడుస్తున్నారే?

చంద్రబాబు ఒక మూడడుగులు ముందుకేస్తుంటే ఆ పార్టీ నేతలు రెండడుగులు వెనక్కు లాగుతున్నారు. అసలే ఓటమి బాధతో ఉన్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రి కాననే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. [more]

Update: 2020-05-22 11:00 GMT

చంద్రబాబు ఒక మూడడుగులు ముందుకేస్తుంటే ఆ పార్టీ నేతలు రెండడుగులు వెనక్కు లాగుతున్నారు. అసలే ఓటమి బాధతో ఉన్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రి కాననే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ ను ముఖ్యమంత్రి గా చూసేందుకు చంద్రబాబు మనసు అసలు అంగీకరించడం లేదు. అందుకే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు.

ప్రతి విషయంలోనూ…

కానీ తెలుగుతమ్ముళ్లు మాత్రం చంద్రబాబు పిలుపునకు స్పందిస్తున్నారా? లేదా? అన్నది పక్కన పెడితే పార్టీ పరువును బజారున పడేస్తుండటం ఇప్పుడు అధినేత చంద్రబాబుకు ఆందోళనకు కారణమయింది. నిన్నగాక మొన్న పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు తమ్ముళ్లకు హుకుం జారీ చేశారు. అయినా కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.

జేసీ వ్యాఖ్యలతో…..

ఇక తాజాగా జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు పరువును పూర్తిగా తీసేశారు. విద్యుత్తు ఛార్జీల పెంపుదలకు నిరసనగా చంద్రబాబు దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండటంతో ఇళ్లల్లోనే ఉండి దీక్షలు చేయాలని సూచించారు. దీంతో నిన్న టీడీపీ నేతలు ఒకరోజు దీక్ష ను ఇళ్లలోనే చేపట్టారు. కొందరు ఏసీీలు వేసుకుని మరీ దీక్షలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆగ్రహంతో ఉన్న బాబు…

దీనికితోడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చంద్రబాబుకు మంట పుట్టించాయనే చెప్పాలి. ఒకవైపు ప్రజలు విద్యుత్తు ఛార్జీల వడ్డనపై మండి పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడేందుకు తాను దీక్షలు చేయాలని పిలుపునిస్తే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఆ దీక్షలు వేస్ట్ అని తీసిపారేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జేసీకి ఫోన్ చేసి మరీ చంద్రబాబు ఇలా మాట్లాడాల్సింది కాదని అన్నట్లు సమాచారం. క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు సొంత నేతలే గండికొడుతుండం పార్టీలో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News