వాళ్లెందుకో అంత దూరం….?

ఔన‌న్నా.. కాద‌న్నా.. టీడీపీలో క‌మ్మ వ‌ర్గం హ‌వా ఎక్కువ‌గా ఉంటుంది. ఈ విష‌యంలో అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చినా, వాటిని క‌వ‌ర్ చేసుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఎన్ని [more]

Update: 2019-11-16 06:30 GMT

ఔన‌న్నా.. కాద‌న్నా.. టీడీపీలో క‌మ్మ వ‌ర్గం హ‌వా ఎక్కువ‌గా ఉంటుంది. ఈ విష‌యంలో అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చినా, వాటిని క‌వ‌ర్ చేసుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఎన్ని ప్రయ‌త్నాలు చేసినా.. ప్రజ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఈ ఎన్నిక‌ల్లో ఆ ఫీలింగ్ ఎక్కువుగా తీసుకు రావ‌డంలో స‌క్సెస్ అయిన వైసీపీ ఏపీలో విజ‌యం సాధించింది. అయినా కూడా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌మ్మ వ‌ర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, వీరంతా పార్టీ కోసం ఏమేర‌కు క‌ష్టప‌డుతున్నారు ? క‌ష్టాల్లో ఉన్న పార్టీని గ‌ట్టెక్కించేందుకు ఏ మేర‌కు కృషి చేస్తున్నారు ? అనేది ప్రశ్నగానే మారింది. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో క‌మ్మ వ‌ర్గానికి చంద్రబాబు పెద్దపీట వేశారు.

వివాదాలున్నప్పటికీ……

వివాదాలు ఉన్నప్పటికీ.. త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌కు ఆయ‌న ఎక్కువ‌గానే టికెట్లు ఇచ్చుకున్నారు. వీరిలో చంద్రబాబుతో స‌హా 11 మంది గెలుపు గుర్రం ఎక్కారు. ఇక పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లోనూ ఇద్దరు గ‌ల్లా జ‌య‌దేవ్‌, కేశినేని నాని క‌మ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే. అయితే, పార్టీ అధికారం కోల్పోయింది. ఈ నేప‌థ్యంలో వీరిలో ఎంత‌మంది పార్టీ కోసం కృషి చేస్తున్నారు. పార్టీ త‌ర‌ఫున అధికార ప‌క్షంపై నిప్పులు చెరుగు తున్నారు. ఉద్యమాల్లో పాల్గొంటున్నారు., నిర‌స‌న వ్యక్తం చేస్తున్నారు? అంటే .. వేళ్ల మీదే క‌నిపిస్తున్నారు.

పట్టున్న నేతలయినా….

ఎమ్మెల్యేల్లో చూస్తే విశాఖ నుంచి గెలిచిన వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు స్థానికంగా మంచి ప‌ట్టున్న నాయ‌కుడు. అయితే, ఈయ‌న ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్నా.. పెద్దగా క్లిక్ కావ‌డం లేదు. పైగా రాష్ట్ర స్థాయిలో ఈయ‌న పెద్దగా పోరాటాలు చేసింది లేదు. పైగా వెల‌గ‌పూడిపై ఇప్పటికే కొన్ని కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆయ‌న అధికార ప‌క్షంపై ఆచి తూచి మాట్లాడుతున్నారు. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వ‌స్తుందోన‌ని ఆయ‌న భ‌యంతో ఉన్నార‌నేది వాస్తవం., ఇక‌, రాజమండ్రి రూర‌ల్ నుంచి విజ‌యం సాధించిన సీనియ‌ర్ బుచ్చయ్య చౌద‌రికి స‌బ్జెక్ట్ ఉన్నా.. ప్రస్తుతం ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. వృద్ధాప్య సమ‌స్యలు కూడా ఆయ‌న‌ను వెంటాడుతున్నాయి. దీంతో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.

వివాద రహితుడైనా….?

విజ‌య‌వాడ తూర్పు నుంచి విజ‌యం సాధించిన గ‌ద్దె రామ్మోహ‌న్ అయితే.. కేసులు లేక‌పోయినా, వివాద‌ర‌హితుడే అయినా.,. పార్టీ త‌ర‌ఫున ఎక్కడా త‌న గ‌ళం వినిపించడం లేదు. నాకెందుకులే..! అని ఆయ‌న స‌రిపెట్టుకుంటున్నారు. ఎప్పుడైనా చంద్రబాబు ఏ కార్యక్రమానికైనా పిలుపిస్తే.. వ‌చ్చి మ‌మ‌! అని అనిపించి వెళ్తున్నారే త‌ప్ప డెడికేటెడ్‌గా ఆ కార్యక్రమాన్ని భుజాల‌పై మాత్రం మోయ‌డం లేదు. విజయవాడ ఎమ్మెల్యే కావడంతో ఎక్కువ ఆర్థిక భారం ఈయనపైనే ఎక్కువ పడుతుండటంతో కొంచెం తప్పించుకు తిరుగుతున్నారు. ఇక‌, గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ మోహ‌న్ రాజ‌కీయ డ్రామాలు తెలిసిందే. పార్టీలో ఉండ‌న‌ని అంటూనే పార్టీ త‌న‌కు ఎంతో మేలు చేసింద‌ని చెబుతూ.. స‌రికొత్త రాజ‌కీయాలు చేస్తున్నారు. దీంతో ఆయ‌న కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు.

పార్టీ కోసం బయట…

ఇక‌, ప్రకాశం జిల్లా ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికి మాత్రమే ప‌రిమిత‌మ‌య్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోన్న ఆయ‌న స్టేట్ అంశాల‌పై ఫోక‌స్ పెట్ట‌డం లేదు. అద్దంకి ఎమ్మెల్యే గ‌ట్టిపాటి ర‌వి సైలెంట్. పైగా ఆయ‌న‌కు వైసీపీతో ఇంకా ఇప్పటికీ ద‌గ్గ‌ర సంబంధాలు ఉన్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుతో సైతం ఆయ‌న‌ అంటీ ముట్ట‌న‌ట్టుగానే వ్యవ‌హ‌రిస్తున్నారు. చంద్రబాబు పిలుపు ఇచ్చినా.. ఎక్కడా క‌నిపించడం లేదు., ఆయన వాయిస్ వినిపించడం లేదు. ఆయ‌న నాలుగు సార్లు గెలిచిన సీనియ‌ర్ అయినా ఆయ‌న ఏనాడు అసెంబ్లీలోనూ, బ‌య‌టా పార్టీ కోసం ఫైట్ చేసిన దాఖ‌లాలు లేవు.

తమ పని తాము….

అదే స‌మ‌యంలో చంద్రఃబాబు బావ‌మ‌రిది, వియ్యంకుడు అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి రెండోసారి గెలిచిన‌ బాల‌య్యకు సినిమాలే లోకంగా మారిపోయింది. పార్టీలో గెలిచిన ఆయ‌న ఇప్పటి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గం ద్యాస‌, ఊసు కూడా లేకుండా పోయాయి. ఇక‌, చీరాల నుంచి ప్రతిష్టాత్మక విజ‌యం ద‌క్కించుకున్న క‌ర‌ణం బ‌ల‌రాం కూడా అంతే. త‌న ప‌నేదో తాను చేసుకుంటున్నారు. ఏ మాత్రం తేడా వ‌చ్చిన కేసుల క‌త్తి త‌న‌కు ఎక్కడ గుచ్చుకుంటుందోన‌ని క‌ర‌ణం హ‌డ‌లి పోతున్నారు. అనంత‌పురం ఉర‌వ‌కొండ‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ప‌య్యావుల కేశ‌వ్ అటు ఇటుగా ఉన్నారు. ఆయ‌న‌కు పీఏసీ చైర్మన్‌గా కీలక ప‌ద‌వి ద‌క్కినా.. మౌనంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇంకా చెప్పాలంటే ఈ వ‌ర్గ ఎమ్మెల్యేల క‌న్నా కాపు వ‌ర్గానికి చెందిన ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు లాంటి వాళ్లు హ‌డావుడి చేస్తున్నారు. సో మొత్తంగా క‌మ్మవ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేల్లో ఒక్క చంద్రబాబు మాత్రమే ఇప్పటికీ యాక్టివ్‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలా అయితే, పార్టీ ఎప్పటికి పుంజుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News