అందుకే ఆగారా? అలా కట్టడి చేయగలిగారా?

జరిగే ప్రతి ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పడం లేదు. జగన్ ఎన్నికల పరంగా దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న నేతలు జంప్ చేస్తారని చంద్రబాబు [more]

Update: 2021-05-06 13:30 GMT

జరిగే ప్రతి ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పడం లేదు. జగన్ ఎన్నికల పరంగా దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న నేతలు జంప్ చేస్తారని చంద్రబాబు సయితం అంచనా వేశారు. అయితే దీనికి విరుగుడు మంత్రాన్ని చంద్రబాబు కనిపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికను చంద్రబాబు ఉపయోగించుకుని నిరాశతో ఉన్న టీడీపీ నేతల్లో ఆశలు కల్పించారు.

యాక్టివ్ గా లేక…

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు చాలావరకూ కన్పించడం లేదు. 174 నియోజకవర్గాల్లో కేవలం పది నుంచి ఇరవై నియోజకవర్గాల్లో మాత్రమే నేతలు యాక్టివ్ గా ఉన్నారు. ఇది చంద్రబాబును కూడా కంగారు పెట్టించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబుకు తెలియంది కాదు. అధికార పార్టీ కావడంతో వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. అందుకే కొన్ని చోట్ల పరోక్షంగా జనసేనతో పొత్తులు పెట్టుకునేలా స్థానిక నేతలకు చంద్రబాబు అవకాశమిచ్చారు.

పరోక్షంగా సంకేతాలు….

ఇక తిరుపతి ఉప ఎన్నికలోనూ ఓటమి తప్పదని చంద్రబాబుకు తెలియంది కాదు. అయితే ఈ ఎన్నికను రానున్న ఎన్నికలకు వేదికగా ఉపయోగించుకున్నారు. తాను లేకుంటే మీరు గెలవలేరని బీజేపీకి చంద్రబాబు పరోక్షంగా సంకేతాలు పంపారు. ప్రచారంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా జగన్ ను మాత్రమే టార్గెట్ చేశారు. బీజేపీకి దగ్గరవ్వడానికి ఆయన చేసిన తొలి ప్రయత్నం ఇదేనంటున్నారు.

ఆలోచనను విరమించుకుని….

బీజేపీ వచ్చే ఎన్నికల్లో తనతో కలుస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే పార్టీ నేతలకు మాత్రం చంద్రబాబు బలంగా సంకేతాలు పంపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన తో కలసి పోటీ చేయబోతున్నామని చెప్పకనే చెప్పారు. ఇది నేతల్లో ఆశలు రేపింది. ఇప్పటి వరకూ అధికార పార్టీవైపు వెళదామని భావించిన నేతలు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఉంటేనే టిక్కెట్ గ్యారంటీతో పాటు మూడు పార్టీలు కలిస్తే గెలుపు ఖచ్చితమని భావించి సైకిల్ దిగేందుకు ఇష్టపడటం లేదు. మొత్తం మీద చంద్రబాబు నేతలను ఇలా కట్టడి చేశారంటున్నారు.

Tags:    

Similar News