ఇప్పటికైనా మారక పోతే ఇక అంతే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉంది. ఈలోగా చంద్రబాబు ఔట్ డేటెడ్ పాలిటిక్స్ [more]

Update: 2021-05-17 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉంది. ఈలోగా చంద్రబాబు ఔట్ డేటెడ్ పాలిటిక్స్ ను మానుకుంటే బెటర్ అని పార్టీ నుంచే సూచనలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. చంద్రబాబుపై ప్రజల్లో ఒకరకమైన భావన ఉండేది. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని. అనుభవంతో ఆయన ప్రగతిని పరుగులు పెట్టించగలరని జనం నమ్మారు.

అధికారంలో ఉన్నప్పుడు….

కానీ 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్నా చంద్రబాబు ప్రజల్లో ఉన్న ఆ నమ్మకాన్ని కోల్పోయారు. చంద్రబాబుకు రాజకీయం మొదట తర్వాతే రాష్ట్రం అన్నది జనాలకు అర్థమయింది. వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకపోవడం, ఒకే చోట అభివృద్ధిని చేయాలనుకోవడం, కొన్ని సామాజికవర్గాలకు దూరం కావడం వంటివి చంద్రబాబును ప్రజలను దూరం చేశాయి.

బాబుపై వ్యతిరేకతే వైసీపీకి….

ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. జగన్ పాదయాత్ర చేయడం కొంత వైసీపీికి ప్లస్ అయినా, చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత వల్లనే వైసీపీకి 151 సీట్లు వచ్చాయన్నది సుస్పష్టం. అయితే గత రెండేళ్లుగా చంద్రబాబు తన తీరును మార్చుకోలేక పోతున్నారు. పాత విమర్శలనే చేస్తున్నారు. మద్యం బ్రాండ్లపై మాట్లాడుతున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసినా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ అదే ప్రచారంపై చంద్రబాబు ఆధారపడ్డారు.

విమర్శలు చేేసే ముందు…..

చంద్రబాబు ఇప్పుడు చేయాల్సింది జగన్ పై విమర్శలు కాదు. తొలుత తాను ఏం చేయదలచుకుంది చెప్పడం. తర్వాత రాజకీయంగా తన స్టాండ్ ఏమిటో చెప్పడం. తాను బీజేపీని ఒక్క మాట అనకుండా జగన్ కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారారని విమర్శించినా ఫలితం ఉండదు. అదే మోదీపై విమర్శలు చేసి తాను ఆ వ్యాఖ్యలు చేస్తే దానిని జనం నమ్ముతారు. కానీ చంద్రబాబు మాత్రం మోదీని ఏమీ అనకుండానే జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత తేవాలనుకుంటే అది సాధ్యం కాదంటున్నారు. మరి చంద్రబాబు ఇప్పటికైనా మారతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News