చంద్రబాబు ఉత్సాహం.. స‌ర్వే ఎఫెక్ట్‌ కారణమేనా?

తిరుప‌తి ఉప ఎన్నిక‌లో స‌త్తా చాటాల‌ని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో త‌గిలిన ఎదురు దెబ్బ‌ల నుంచి వెంట‌నే తేరుకున్నారు. శ్రేణుల‌ను ఉత్సాహ [more]

Update: 2021-04-14 14:30 GMT

తిరుప‌తి ఉప ఎన్నిక‌లో స‌త్తా చాటాల‌ని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో త‌గిలిన ఎదురు దెబ్బ‌ల నుంచి వెంట‌నే తేరుకున్నారు. శ్రేణుల‌ను ఉత్సాహ ప‌రుస్తూ.. తిరుపతి ఉప పోరులో ఆయ‌న ప్రచారం చేశారు. అయితే.. నాణేనికి ఇది ఒక‌వైపు మాత్రమే. తాజాగా ఆయ‌న అంత‌ర్గతంగా చేయించుకున్న ఓ స‌ర్వేలో.. వైసీపీకి ఎదురుదెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని.. టీడీపీ గ‌ట్టి పోటీ ఇస్తోంద‌ని తేలింద‌ట‌. అంతేకాదు.. మ‌రింత‌గా క‌ష్టప‌డితే.. ప‌ట్టణ ప్రాంతాల్లోని ఓట‌ర్లు.. వైసీపిని వీడి.. టీడీపీ బాట‌ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తేలిన‌ట్టు టీడీపీ నేత‌ల మ‌ధ్య వినిపిస్తోంది.

పథకాల్లో కూడా….

ఈ ప‌రిణామంతో చంద్రబాబు మ‌రింత ఉత్సాహంతో చేశారు. జ‌గ‌న్ ప్రవేశ పెడుతున్న ప‌థ‌కాల్లో చాలా వ‌ర‌కు కొద్ది మందికి మాత్రమే ల‌బ్ధి చేకూరుస్తున్నాయి. దీంతో మిగిలిన వారు సైలెంట్‌గా ఉన్నారు. గ‌త స్థానిక ఎన్నిక‌ల్లో కూడా వీరు ఓటు వేయ‌డానికి రాలేదు. దీంతో వీరిని క‌నుక ఓటు వేసేలా ప్రోత్సహించిన‌ట్ట‌యితే.. అది త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌ని టీడీపీ నేత‌లు చేసిన స‌ర్వేలో స్పష్టమైంది. మొత్తంగా పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఐదు నియోజ‌క‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌లు స‌ర్వే చేయించారు. అయితే.. ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆశించిన విధంగానే ఫ‌లితాలు వ‌చ్చాయ‌ట‌. స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌రిగిన అన్యాయంపై కొంత సింప‌తీ కూడా జోడైంద‌ని తెలిసింది.

వారి ఆధిపత్యంపై…..

అదే స‌మ‌యంలో తిరుప‌తిలో జ‌రు‌గుతున్న అన్యమ‌త ప్రచారం.. అభివృద్ధి జ‌ర‌గ‌ని విధానం.. తిరుమ‌ల మొత్తాన్నీ రెడ్డి సామాజిక వ‌ర్గమే ఆక్యుపై చేయ‌డం వంటివి ప్రజ‌ల మ‌ధ్య చ‌ర్చకు వ‌స్తున్నాయి. బ‌లిజ వ‌ర్గం ఓట‌ర్లలో కూడా చంద్రబాబే న‌యం.. కాస్తో కూస్తో త‌మ‌కు మేలు చేశాడ‌ని.. ఈ ప్రభుత్వంతో ఒరిగింది లేద‌ని చ‌ర్చ స్టార్ట్ అయ్యిందంటున్నారు. ముఖ్యంగా తిరుప‌తి, శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లిజ ఓట‌ర్లలో మార్పు ఎక్కువుగా ఉందంటున్నారు.

అదే తమ టార్గెట్….

దీంతో ఆయా అంశాల‌ను క‌నుక టార్గెట్ చేసుకుంటే.. చంద్రబాబుకు ఆశించిన విధంగానే ఇక్కడ ప్రజ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని స‌ర్వేలో స్పష్టమైన‌ట్టు త‌మ్ముళ్ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరులో ఇప్పుడు వైసీపీ నేత‌ల మ‌ధ్య అసంతృప్తి సెగ‌లు కక్కుతోంది. ఈ క్రమంలో అభివృద్ధి కూడా ముందుకు సాగ‌డం లేదు. దీంతో ఇక్కడ ఎక్కువ‌గా టీడీపీకి సానుకూల‌త ఉన్నట్టు పార్టీ నేత‌లు గ్రహించారు. అందుకే ఎక్కువ‌గా నెల్లూరును టార్గెట్ చేసుకుని చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News