టీడీపీలోకి ఇక భారీ చేరికలు.. గుడ్ డేస్ ఫర్ బాబు

ఇప్పటి వరకూ వైసీపీలోకి టీడీపీ నేతలు జంప్ చేశారు. అయితే మరో మూడు నెలల తర్వాత సీన్ రివర్స్ అవుతుందంటున్నారు. టీడీపీలోకి భారీగా చేరికలు ఉండే అవకాశాలు [more]

Update: 2021-04-24 03:30 GMT

ఇప్పటి వరకూ వైసీపీలోకి టీడీపీ నేతలు జంప్ చేశారు. అయితే మరో మూడు నెలల తర్వాత సీన్ రివర్స్ అవుతుందంటున్నారు. టీడీపీలోకి భారీగా చేరికలు ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే జగన్ ను నమ్ముకుని అనేక మంది నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రెండేళ్లవుతున్నా జగన్ కొందరు ముఖ్యమైన నేతలను పక్కన పెట్టేశారు.

అందరినీ పక్కన పెట్టి…..

వారికి ప్రత్యామ్నాయం లేదనుకున్నారో? తనను వదలి వెళ్లనని భావించారో తెలియదు కానీ అనేక మంది జిల్లాల్లో నేతలను జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. దాడి వీరభద్రరావు, డీఎల్ రవీంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ లాంటి నేతలు జిల్లాకు ఒకరు ఉన్నారు. వీరంతా త్వరలో ఖాళీ అయ్యే 18 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారైనా తమకు చోటు దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు.

తమ దారి తాము…..

అయితే అప్పుడు కూడా తమకు ఎలాంటి పదవులను జగన్ ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకోక తప్పదు. దాడి వీరభద్రరావు లాంటి నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దాడి ఇప్పటికే అనేక సార్లు పార్టీ మారి వచ్చారు. మరోసారి పార్టీ మారరన్న గ్యారంటీ లేదు. ఇప్పటికే రాయచోటి నుంచి రాంప్రసాద్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఆయనకు ఎలాంటి పదవులు వైసీపీలో దక్కకపోవడంతోనే తనదారి తాను చూసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన శిద్ధారాఘవరావు, కదిరి బాబూరావు లాంటి వాళ్లు తిరిగి చంద్రబాబు పంచన చేరే అవకాశముంది.

వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు…..

ఇక ఎన్నికలకు పెద్దగా సమయం ఉండదు. మరోసారి కష్టపడినా జగన్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. అయితే ఇప్పుడే పార్టీని వీడి టీడీపీలో చేరి అక్కడ బెర్త్ రిజర్వ్ చేసుకుందామన్న ఆలోచనలో పలువురు నేతలు ఉన్నట్లు తెలిసింది. గతంలో వైసీపీ టిక్కెట్ ఆశించి రానివారు సయితం రానున్న ఆరు నెలల కాలంలో వైసీపీని వీడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. తమ వ్యక్తిగత రాజకీయ లబ్దినే ఎవరైనా ఆలోచిస్తారు. అందులో భాగంగానే టీడీపీలోకి భారీ వలసలుంటాయంటున్నారు.

Tags:    

Similar News