టీడీపీ బాగా వీకయినట్లుంది.. ఇందులో కూడా?

తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి వారు ప్రయారిటీ ఇచ్చారు. ఆ తర్వాత పదేళ్లు అధికారానికి టీడీపీ దూరంగా ఉన్నప్పటికీ వారు పార్టీకి అండగానే నిలిచారు. కానీ [more]

Update: 2020-05-23 11:00 GMT

తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి వారు ప్రయారిటీ ఇచ్చారు. ఆ తర్వాత పదేళ్లు అధికారానికి టీడీపీ దూరంగా ఉన్నప్పటికీ వారు పార్టీకి అండగానే నిలిచారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత మాత్రం తెలుగుదేశం పార్టీకి వారు దూరమయినట్లే కన్పిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలన్నీ ఎక్కువగా హైదరాబాద్ లోనే స్థాపించారు. మంచి వాతావరణం, అన్ని రకాలుగా అనుకూలతలు ఉండటంతో ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలు ఎక్కువగా హైదరాబాద్ లోనే పరిశ్రమలు స్థాపించి అక్కడే స్థిరపడిపోయారు.

ఉమ్మడి రాష్ట్రంలో…..

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదన్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీంతో పారిశ్రామికవేత్తలు పార్టీకి ఇతోధికంగా విరాళాలు ఇచ్చేవారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయల విరాళాలు పారిశ్రామిక వేత్తలు ఇచ్చేవారు. ఇక 2004 నుంచి 2014 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. పదేళ్ల పాటు టీడీపీకి విరాళాలు ఇవ్వడంలో ఏమాత్రం పారిశ్రామికవేత్తలు తగ్గలేదు. ఉమ్మడి రాష్ట్రం కాబట్టి చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావచ్చన్న కారణంగా పారిశ్రామిక వేత్తలు సాయం చేశారు.

రహస్య విరాళాలు…

పారిశ్రామికవేేత్తల్లో ఎక్కువ భాగం చంద్రబాబు సామాజిక వర్గం నేతలే ఎక్కువగా ఉన్నారు. వీరింతా బహిరంగంగా విరాళాలు ఇవ్వడమే కాకుండా ఎక్కువ మంది రహస్యంగా కూడా విరాళాలు ఇస్తుంటారు. అయితే 2014 నుంచి తెలుగుదేశం పార్టీకి విరాళాలు భారీగా తగ్గాయి. కాంట్రాక్టర్లు మాత్రమే కొద్దోగొప్పో విరాళాలు ఇస్తున్నారు తప్పించి హైదరాబాద్ లో పరిశ్రమలు ఉన్న వారు చంద్రబాబుకు మొహం చాటేశారు. చంద్రబాబుతో పనిలేకపోవడం, తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రాలేదన్న కారణంగానే వారు విరాళాలు ఇవ్వడం లేదు.

విభజన తర్వాత….

తాజాగా ఇటీవల అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ అనే సంస్థ ప్రాంతీయ పార్టీలకు అందిన విరాళాలను ప్రకటించింది. అధికార వైసీపీకి ఎన్నికల సందర్భంగా వందకోట్ల విరాళాలు అందాయి. అదే తెలుగుదేశం పార్టీకి 37 కోట్లు అందాయి. ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ రెండో స్థానంలో ఉండగా, టీడీపీ ఐదోస్థానంలో విరాళల సేకరణలో ఉండటం విశేషం. నిజానికి పార్టీకి మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. కానీ 2014లో టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చినా విరాళాల విషయంలో చంద్రబాబు వెనకబడి పోయారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర విభజనేనంటున్నారు. వైసీపీకి విరాళాలు ఎలా వచ్చాయన్నది సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Tags:    

Similar News