అన్నీ లెక్కలు సరిచూసుకున్న తర్వాతే..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించడానికి అనేక కసరత్తులు చేశారు. ఇందుకోసం వ్యూహకర్తతో కూడా ఆయలన మాట్లాడారు. అన్నీ చర్చించిన తర్వాతే బహిష్కరణ బెటర్ [more]

Update: 2021-04-07 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించడానికి అనేక కసరత్తులు చేశారు. ఇందుకోసం వ్యూహకర్తతో కూడా ఆయలన మాట్లాడారు. అన్నీ చర్చించిన తర్వాతే బహిష్కరణ బెటర్ అని చంద్రబాబు భావించి ప్రకటించారు. అయితే బహిష్కరణతో చంద్రబాబుకు, ఆయన పార్టీకి జరిగే నష్టంకంటే రాజకీయంగా లాభమే ఎక్కువని పార్టీ సీనియర్ నేతలు సయితం విశ్లేషిస్తున్నారు.

వైసీపీ విజయోత్సాహాన్ని….

పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎటూ తమను గెలవనివ్వదు. తాము బహిష్కరించామని చెబితే ఆ విజయం వైసీపీకి ఏకపక్షంగా సొంతకాదు. టీడీపీ పోటీ చేసి ఉంటేనా? అన్న క్వశ్చన్ మార్క్ అందరి మైండ్ లో ఉండిపోతుంది. పార్టీ గుర్తులు ఈ ఎన్నికల్లో ఉండటంతో పంచాయతీ ఎన్నికలు మాదిరి లెక్కలు చెప్పే అవకాశం లేదు. అందుకే వైసీపీకి విజయోత్సాహాన్ని మరింత అందివ్వకుండా ఉండేందుకు చంద్రబాబు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారంటున్నారు.

తమ అభ్యర్థులు గెలిస్తే….

ఇక మరో లాభాన్ని కూడా చంద్రబాబు చూశారు. తాను బహిష్కరించినా పోటీలో ఉన్న అభ్యర్థులు బరిలో ఉండాలని మౌఖికంగా అధినాయకత్వం నుంచి ఆదేశాలు అందాయి. అందుకే సీనియర్ నేతలు సయితం, మంగళగిరి, హిందూపురం వంటి చోట్ల కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒకవేళ అభ్యర్థులు గెలిచినా తాము మద్దతివ్వకపోయినా తమ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలిచారని చెప్పుకునే వీలు చంద్రబాబుకు కలుగుతుంది.

వారికి చేరువయ్యే ఛాన్స్…..

అదే సమయంలో బీజేపీ, జనసేనకు చేరువవ్వడానికి కూడా చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. తాము బరిలో లేని చోట ఎటూ టీడీపీ క్యాడర్ వారికి మద్దతిస్తుంది. దీంతో తాము మద్దతిస్తేనే గెలుస్తామన్న అభిప్రాయాన్ని జనసేన, బీజేపీలో కలిగించినట్లవుతుందన్నది చంద్రబాబు ఆలోచన. ఇలా అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత చంద్రబాబు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని పార్టీకి చెందిన ఒక సీనియర నేత విశ్లేషించారు.

Tags:    

Similar News