బాబుపై పెరుగుతున్న ప్రెజర్… బీజేపీపై?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు. ఆయన లాక్ డౌన్ నుంచి మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తున్నారు. ప్రశంసిస్తున్నారు. కానీ సీనియర్ [more]

Update: 2020-05-23 09:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు. ఆయన లాక్ డౌన్ నుంచి మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తున్నారు. ప్రశంసిస్తున్నారు. కానీ సీనియర్ నేతలు మాత్రం బీజేపీతో అంటకాగేందుకు అంగీకరించడం లేదు. ఈ విషయాలను అంతర్గత సమావేశాల్లో చంద్రబాబుకు సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇందుకు కారణాలను కూడా వారు వివరిస్తున్నారు.

భవిష్యత్తులో ప్రయోజనం లేదని….

భారతీయ జనతా పార్టీతో జత కట్టినందున భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు లేవని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు కూడా లేదని, విడిగా పోటీ చేసినా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా చీల్చే అవకాశం లేదని చెబుతున్నారు. జనసేన పార్టీ బీజేపీతో జత కట్టడం వల్ల కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, అందుకే బీజేపీతో కలవడం వేస్ట్ అన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అవమానించినా…

చంద్రబాబు తనను విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరినా కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతను బీజేపీ అవమానించిందని కూడా అంటున్నారు. అందుకే ఇటీవల సీనియర్ నేతలు బీజేపీ పై విమర్శలు స్టార్ట్ చేశారు. బీజేపీ తాము ఎంత దగ్గరవ్వాలనుకున్నా వైసీపీ వైపు చూస్తుందన్నది టీడీపీ నేతల అనుమానం. అందుకే బీజేపీతో సఖ్యత వద్దని చంద్రబాబుకు సీనియర్ నేతలు పదే పదే చెబుతున్నారు.

మహానాడులో తేల్చేయాలని…..

కరోనా తర్వాత మోదీ ఇమేజ్ దేశ వ్యాప్తంగా పడిపోయిందని కూడా గుర్తు చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం పార్టీ భవిష్యత్తు కోసం బీజేపీతో చెలిమి అవసరమని భావిస్తున్నారు. ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉండటంతో బీజేపీతో వైరం ఎందుకన్నది చంద్రబాబు ప్రశ్న. కానీ ఎన్నికలకు ముందు బీజేపీని విమర్శిస్తే ప్రజలు నమ్మరని ఇప్పటి నుంచే బీజేపీ, వైసీపీని టార్గెట్ చేయాలని సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచిస్తున్నారు. అందుకే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. మహానాడులో బీజేపీ పట్ల పార్టీ వైఖరిని చెప్పాలని నేతలు చంద్రబాబుపై వత్తిడి తెస్తున్నారు.

Tags:    

Similar News