పట్టు కోల్పోయారా? నమ్మకం పోగొట్టుకున్నారా?

నిజం చంద్రబాబు పార్టీపై పట్టుకోల్పోతున్నట్లే కన్పిస్తుంది. గత రెండేళ్ల నుంచి నేతలతో పాటు క్యాడర్ కూడా సహకరించకపోవడమే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు నాయుడు అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి [more]

Update: 2021-04-18 06:30 GMT

నిజం చంద్రబాబు పార్టీపై పట్టుకోల్పోతున్నట్లే కన్పిస్తుంది. గత రెండేళ్ల నుంచి నేతలతో పాటు క్యాడర్ కూడా సహకరించకపోవడమే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు నాయుడు అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే తన వ్యూహాలు సక్సెస్ అయిన వేళ ఆయనను నేతలు విశ్వసించారు. ఏమాత్రం వర్క్ అవుట్ కాకపోతే వెంటనే పార్టీలో ఇబ్బంది కర పరిస్థితులు ఏర్పడ్డాయి.

అప్పుడూ అంతే…..

చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీ రావడం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుండటంతో అప్పటి వరకూ వెన్నంటి ఉన్న నేతలు అనేక మంది పార్టీని వీడిపోయారు. మైసూరా రెడ్డి, సి.రామచంద్రయ్య, తమ్మినేని సీతారాం, దాడి వీరభద్రరావు, కళా వెంకట్రావు ఇలా ఆయన గట్టిగా నమ్ముకున్న నేతలు చంద్రబాబును మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు.

మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత….

ఇక 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబును సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి వారు పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలు చంద్రబాబుకు తెలిసే జరిగాయని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఇక తర్వాత తోట త్రిమూర్తులు లాంటి వాళ్లు సయితం తమ దారి తాము చూసుకున్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించలేరన్న నమ్మకం తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉంది.

మరికొందరు తమ దారి….

అందుకే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే విజయం దక్కదని సీనియర్ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. అందుకే మొహం చాటేస్తున్నారు. సీనియర్ నేతలు సయితం పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం చంద్రబాబుపై నమ్మకం లేకపోవడమే. రానున్న కాలంలో మరింత మంది నేతలు చంద్రబాబును వీడే అవకాశముందంటున్నారు. ప్రజల్లో కూడా చంద్రబాబుకు విశ్వసనీయత లేదని గుర్తించిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. చంద్రబాబుకు రానున్న కాలంలో షాక్ లు తప్పవంటున్నారు.

Tags:    

Similar News