ఆ పదమే కొంపముంచిందట…దాన్ని ఇక నిషేధించారట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను చేసిన తప్పులను తెలుసుకుంటున్నారా? అవును… తన వ్యాఖ్యలతో కొన్ని వర్గాలను దూరం చేసుకున్నానని ఆయనకు ఇప్పటికి తెలిసి వచ్చింది. మున్సిపల్ [more]

Update: 2021-04-16 05:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను చేసిన తప్పులను తెలుసుకుంటున్నారా? అవును… తన వ్యాఖ్యలతో కొన్ని వర్గాలను దూరం చేసుకున్నానని ఆయనకు ఇప్పటికి తెలిసి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో బెదిరించి వైసీపీ ఓట్లు వేయించుకుందని బయటకు చెప్పినప్పటికీ లోన మాత్రం ఓట్ల శాతం తగ్గడంపై చంద్రబాబు పదే పదే విశ్లేషణలు చేసుకుంటున్నారు. జిల్లాల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. ఎందుకు ఓటు శాతం తగ్గిందన్న దానిపై చంద్రబాబు పదే పదే సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు.

సమన్వయంతో పనిచేయక….

అయితే ఓటు శాతం తగ్గడానికి ప్రధాన కారణం నేతలు సమన్వయంతో పనిచేయకపోవడం ఒక కారణం కాగా, మరొకటి జగన్ పై క్రిస్టియన్ ముద్ర వేయాలని ప్రయత్నించడం. చంద్రబాబు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పదే పదే జగన్ పై క్రిస్టియన్ ముద్రవేసేందుకు ప్రయత్నించారు. అంతర్వేది, రామతీర్థం ఘటనల తర్వాత ప్రారంభించిన చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల వరకూ దీనిని కొనసాగించారు.

క్రిస్టియన్ ముద్ర…..

దీంతో జగన్ మాత్రం అనేక దేవాలయాలు, గోపూజల్లో పాల్గొని హిందూ మతానికి తాను వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ చంద్రబాబుకు మాత్రం క్రైస్తవ ఓటర్లు దూరమయ్యారు. పదే పదే ముఖ్యమంత్రిని క్రిస్టియన్ గా పేర్కొనడం తో 90 శాతం మంది దూరమయినట్లు చంద్రబాబు కు అందిన ఫీడ్ బ్యాక్ ను బట్టి తెలుస్తోంది. ముఖ్యమంత్రికి మతాన్ని అంటగట్టడం వల్ల ఉద్యోగ, వ్యాపార వర్గాలు కూడా దూరమయ్యాయంటున్నారు. అందుకే రాజధాని అంశం కూడా ఏమాత్రం పనిచేయలేదని చెబుతున్నారు.

అందుకే ఇకపై…..

జగన్ ఫ్యాక్షనిస్టుగా, ఉన్మాదిగా పేర్కొనడం వరకూ బాగానే ఉంది కాని, క్రిస్టియన్ అని అనడం కొన్ని వర్గాల వారి మనోభావాలను దెబ్బతీసిందని సీనియర్ నేతలు సయితం అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. బీజేపీ అన్నా దానికి ఒక అర్థముంది కాని, టీడీపీ అధినేత నోట నుంచి ఆ మాట రావడం సరికాదంటున్నారు. అందుకే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఆ పదం రాకుండా జాగ్రత్త పడాలని చంద్రబాబు నేతలందరికీ సూచించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News