తాడిపత్రి తరహా వ్యూహమే బెటర్.. అందుకే ఆ దిశగా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి అయోమయంగా ఉంది. పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. సీరియన్ గా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించడం లేదు. అదే [more]

Update: 2021-04-12 05:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి అయోమయంగా ఉంది. పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. సీరియన్ గా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించడం లేదు. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎవరైతే దూకుడుగా ఉన్నారో వాళ్లే ఇప్పటికీ కన్పిస్తున్నారు. మిగిలిన నేతలు మౌనంగా ఉన్నారు. అందుకే చంద్రబాబు కొత్త తరహాలో వెళ్లాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగయితేనే వైసీపీని ధీటుగా ఎదుర్కొనగలమని చంద్రబాబు భావిస్తున్నారు.

రెండేళ్ల నుంచి…..

గత రెండేళ్ల నుంచి పార్టీ పూర్తిగా బలహీనంగా ఉంది. టీడీపీ అధినేతగా చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేతలు రోడ్డు మీదకు రావడం లేదు. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాల్సి వచ్చింది. అలాగే పట్టణ ప్రాంతాల ఓటర్లు తమకు అండగా ఉంటానుకుంటే అక్కడ కూడా చేదు అనుభవం ఎదురయింది. ఒక తాడిపత్రిలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. దీంతో తాడిపత్రి తరహా వ్యూహాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

వాలంటీర్ల వ్యవస్థను…..

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి బలమైన నేత అయినా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో, వాలంటీర్లు భయపెట్టినా తాము ఉన్నామంటూ భరోసా కల్పించడంతోనే అక్కడ సక్సెస్ అయ్యారు. ఇదే పద్ధితిలో వాలంటీర్ల వ్యవస్థకు పోటీగా టీడీపీ కార్యకర్తలను నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రతి వార్డుకు ఒక కార్యకర్తను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు.

వారికి పూర్తి బాధ్యతలు…..

వార్డులో ఏం జరిగినా వారికే బాధ్యతను అప్పగిస్తారు. వారికి ఆర్థికంగా, న్యాయపరంగా పార్టీ నుంచి సహకారం అందిస్తారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ తరహా వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. ఇక్కడ కొంతమేర సక్సెస్ అయినా రాష్ట్రమంతటా అదే రకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికీ టీడీపీకి బలమైన కార్యకర్తలున్నా వారు స్థానిక నేతల చేతుల్లో బందీలుగా మారారు. అలా కాకుండా కేంద్ర పార్టీ నాయకత్వంతో నేరుగా సంబంధాలు ఏర్పరచి వారిని యాక్టివ్ చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అంటే తాడిపత్రిలో వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకోవడం వల్లనే జేసీ విజయం సాధించారని భావిస్తున్న చంద్రబాబు అదేరకమైన వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఒక టీం వర్క్ అవుట్ చేస్తుందట.

Tags:    

Similar News