ఆ ఎన్నిక‌ల‌ను టీడీపీ బాయ్ కాట్ చేస్తుందా ? బాబు వ్యూహం ఏంటి..?

రాష్ట్రంలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీ.. 2019 సార్వత్రిక ఎన్నిక‌ల నుంచి ఇప్పటి వ‌ర‌కు తీవ్రమైన ఎదురు దెబ్బలు త‌గిలించు కుంటోంది. ఎక్కడిక‌క్కడ పుంజుకుంటున్నామ‌ని చెబుతున్నా.. ఆ [more]

Update: 2021-04-09 12:30 GMT

రాష్ట్రంలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీ.. 2019 సార్వత్రిక ఎన్నిక‌ల నుంచి ఇప్పటి వ‌ర‌కు తీవ్రమైన ఎదురు దెబ్బలు త‌గిలించు కుంటోంది. ఎక్కడిక‌క్కడ పుంజుకుంటున్నామ‌ని చెబుతున్నా.. ఆ దిశ‌గా టీడీపీ అడుగులు వేసింది లేదు. పైకి మాత్రం జ‌గ‌న్‌పై విమ‌ర్శలు, పార్టీపై విమ‌ర్శలు, నేత‌ల‌పై విమ‌ర్శలు చేస్తూ.. ప్రజ‌ల‌ను అడ్డగోలుగా దోచుకుంటున్నార‌ని చెబుతున్నా వీరి మాట‌లు ప్రజ‌లు న‌మ్మడం లేదు. ఎన్ని విమ‌ర్శలు చేస్తున్నా దీనిని ఓట్ల రూపంలో మార్చుకుని.. పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డంలో మాత్రం టీడీపీ ఘోరంగా విఫ‌ల‌మ‌వుతోంది. 2019లో 175 స్థానాలున్న అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగితే..కేవ‌లం 23 స్థానాల‌కే టీడీపీ ప‌రిమిత‌మైంది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. రెండేళ్లకు వ‌చ్చిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పుంజుకుంటామ‌ని.. జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర వ్యతిరేక‌త ఉంద‌ని ప్రచారం చేశారు.

అన్ని ఎన్నికల్లో…..

దీంతో పార్టీలోనూ కొంత ఉత్సాహం క‌నిపించింది. ఈ క్రమంలో పార్టీలో కీల‌క ప‌ద‌వుల‌ను కూడా ఫిల్ చేశారు. పార్టీ పుంజుకుంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు.. కానీ, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కేవ‌లం 10 శాతానికే టీడీపీ ప‌రిమిత‌మైంది. మ‌రోవైపు అధికార పార్టీపై వ్యతిరేక‌త ఉంద‌ని టీడీపీ ప్రచారం చేసిన దానికి భిన్నంగా ఫ‌లితం వ‌చ్చింది. ఏకంగా 81 శాతం పంచాయ‌తీల‌ను వైసీపీ ద‌క్కించుకుంది. పోనీ.. పార్టీ గుర్తుల‌పై పోలింగ్ జ‌రిగిన స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇక్క‌డ కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తాడిప‌త్రిలో మాత్రమే టీడీపీ మునిసిపాలిటీని ద‌క్కించుకున్నా.. ఆ క్రెడిట్ కూడా జేసీ ద‌క్కకుండా చేశారు. జ‌గ‌న్ స‌హ‌క‌రించ‌బ‌ట్టే.. తాను గెలిచాన‌ని చెప్పేశారు. దీంతో టీడీపీలో ఒక విధ‌మైన నైరాశ్యం ఏర్పడింది.

తిరుపతి పార్లమెంటు ఎన్నిక తర్వాత….

ఇక‌, ఇప్పుడు తిరుప‌తి పార్లమెంటు ఉప ఎన్నిక వ‌చ్చింది. ఇక్కడ క‌నుక టీడీపీ గెలుపు గుర్రం ఎక్కక‌పోతే.. పార్టీలో నాయ‌కులు నిల‌బ‌డే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా దిగువ స్థాయి కేడ‌ర్ పూర్తిగా చెల్లాచెదురు అయిపోతుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక్కడ ప‌ట్టు పెంచుకునేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ రెండు విధాలుగా ఆయ‌న ఆలోచ‌న చేస్తున్నారు. ఒక‌టి గెలిస్తే.. ఇక‌, పార్టీకి తిరుగులేద‌ని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో త్వర‌లోనే జ‌ర‌గ‌నున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటేందుకు సిద్ధమ‌వుతున్నారు.

తక్కువ మెజారిటీతో ఓడిపోతే…?

ఒక వేళ త‌క్కువ మెజారిటీతో అంటే 50 వేలు, లేదా ల‌క్ష ఓట్ల తేడాతో ఓడితే.. ఒకింత పుంజుకునేందుకు ప్రయ‌త్నిస్తారు. కానీ.. జ‌గ‌న్ వ్యూహం మేర‌కు ఏకంగా రెండు నుంచి మూడు ల‌క్షల మెజారిటీతో వైసీపీ గెలిచి.. అంతే తేడాతో టీడీపీ ఓడిపోతే.. మాత్రం ఇదంతా జ‌గ‌న్ కుట్ర.. అరాచ‌క పాల‌న అంటూ.. మ‌రింత‌గా దాడి పెంచాల‌ని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇక‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను కూడా బాయ్ కాట్ చేయాల‌ని నిర్ణయించుకున్నట్టు స‌మాచారం. తిరుప‌తిలో కూడా టీడీపీ ఓడిపోతే.. లేదా భారీ మెజారిటీ తేడా వ‌స్తే.. అస‌లు ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్రభావం ప‌డుతుంది.

ఈ తరహాలోనే బాయ్ కాట్….

పార్టీ జెండా మోసే వారు కూడా క‌నిపించ‌రు. దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వ్యూహాత్మకంగా బాయ్‌కాట్ నినాదాన్ని ఎంచుకోవాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణయించుకున్నార‌ట‌. అంటే ఎన్నిక‌ల ప్రచారంలో ముఖ్యనేత‌లు ఎవ్వరూ పాల్గొన‌రు.. ముందే ఎన్నిక‌లు బాయ్‌కాట్ అని చెపుతారు. ఎక్కడ అయినా గ‌ట్టి పోటీ ఉన్న చోట పార్టీ గెలిస్తే తాము బాయ్‌కాట్ చేసినా కొన్ని స్థానాలు గెలిచామ‌ని చెప్పుకోవాల‌న్నదే బాబు ప్లాన్ అట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు వ‌ర్కవుట్ అవుతుందో ? చూడాలి.

Tags:    

Similar News