బాబును డోన్ట్ కేర్.. నాన్చడమే నష్టం తెస్తుందా?

అనుకున్నట్లుగానే జరగుతోంది. టీడీపీ లైన్ తప్పుతోంది. చంద్రబాబు మౌనం పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై చంద్రబాబు ఇంతవరకూ పెదవి విప్పలేదు. ఇద్దరు [more]

Update: 2020-05-17 11:00 GMT

అనుకున్నట్లుగానే జరగుతోంది. టీడీపీ లైన్ తప్పుతోంది. చంద్రబాబు మౌనం పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై చంద్రబాబు ఇంతవరకూ పెదవి విప్పలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కటేనని, ఈ గేమ్ ను కొంతకాలం చూద్దామని చంద్రబాబు తెలిపారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఎవరూ స్పందించవద్దని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. ఇటు ఏపీ, అటు తెలంగాణ టీడీపీ నేతలు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

సీమ నేతలు…..

కానీ చంద్రబాబు ఆదేశాలను నేతలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 ను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల టీడీపీ నేతలు సమర్థిస్తున్నారు. పోతిరెడ్డిపాడు కారణంగా రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందుతుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు నీరు అందుతుంది. జగన్ నిర్ణయాన్ని పార్టీల కతీతంగా అందరూ సమర్థిస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందాలంటే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అవసరమని మైధావులు, ఇంజినీరింగ్ నిపుణులు భావిస్తున్నారు.

బాబు మౌనంగా…..

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మౌనం పార్టీని ఇబ్బందుల్లో పడేస్తుంది. జగన్, కేసీఆర్ ట్రాప్ లో పడకూడదన్నది చంద్రబాబు అభిమతం. అందుకే ఆయన వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. కానీ ఇటీవల జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలోనూ రాయలసీమ నేతలు జీవో నెంబరు 203 ను సమర్ధించాలని కోరారు. అయితే చంద్రబాబు ససేమిరా అన్నారు. కరోనా నుంచి ప్రజలను డైవెర్ట్ చేయడానికి ఇద్దరు సీఎంలు ఆడుతున్న నాటకంగా చంద్రబాబు కొట్టిపారేశారు.

సీమ నేత సమర్థిస్తూ….

కానీ తాజాగా తెలుగుదేశం పార్టీ నేత జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకటన చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. జగన్ సొంతజిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి జీవో నెంబరు 203ని సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఆయన వ్యవహరిస్తున్నారు. రాయలసీమ వాసుల కోసం ఎవరు పోరాడినా తాము అండగా ఉంటామని బీటెక్ రవి తెలిపారు. దీంతో చంద్రబాబు పార్టీ పరంగా నిర్ణయాన్ని ప్రకటించక ముందే నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం వివాదాస్పదమయింది. ఇది పార్టీకి నష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News