చంద్రబాబు మ‌రో రాంగ్ స్టెప్‌.. త‌మ్ముళ్ల గుస‌గుస

మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌రిగిన కొన్ని పొర‌పాట్లు.. అతి విశ్వాసం.. వంటివి టీడీపీని ఘోరంగా దెబ్బతీశాయ‌నే వాద‌న ఉంది. పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా ఇంచార్జుల‌ను నియ‌మించిన నేప‌థ్యంలో వారంతా [more]

Update: 2021-04-03 05:00 GMT

మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌రిగిన కొన్ని పొర‌పాట్లు.. అతి విశ్వాసం.. వంటివి టీడీపీని ఘోరంగా దెబ్బతీశాయ‌నే వాద‌న ఉంది. పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా ఇంచార్జుల‌ను నియ‌మించిన నేప‌థ్యంలో వారంతా కూడా పార్టీని ముందుకు న‌డిపిస్తార‌ని.. స్థానికంగా పార్టీని ప‌రుగులు పెట్టిస్తార‌ని అనుకున్నారు. అయితే.. ఎప్పుడూ త‌న చుట్టూ ఉన్న వారి మాట‌ల‌కే విలువ ఇవ్వడం.. త‌న‌కంటూ.. ప్రత్యక్ష ప‌ర్యవేక్ష‌ణ లోపించ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో చంద్రబాబు వ్యూహం స్థానికంలో విఫ‌ల‌మైంది. ఇక‌, ఇప్పుడు క‌ళ్లముందు క‌నిపిస్తున్న కీల‌క యుద్ధం తిరుప‌తి. పార్లమెంటు ఉప ఎన్నిక‌. అధికార పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కైవ‌సం చేసుకుంటే.. టీడీపీ ప్రతిష్ఠ .. స్థానికంలో త‌గిలిన గాయాల‌ను మానేలా చేస్తుంద‌నే వాద‌న ఉంది.

ముందుగానే ప్రకటించినా….

అయితే.. అప్పుడే టీడీపీలో తిరుప‌తి పార్లమెంటు ఉప పోరుపై.. అనేక విమ‌ర్శలు.. త‌మ్ముళ్ల మ‌ధ్య గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి చాలా ముంద‌స్తు వ్యూహంతో చంద్రబాబు ఇక్కడ‌.. అడుగులు వేశారు. స్థానిక ఎన్నిక‌ల‌కు ముందుగానే ఆయ‌న ఇక్కడ సీటును కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మికి కేటాయించారు. దీంతో సీటుపై ఆశ‌లు పెట్టుకున్న వారి నుంచి త‌న‌కు ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని అనుకున్నారు. ఇంత వ‌రకు బాబు స‌క్సెస్ అయ్యారు. అయితే.. తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ ఘోర‌ప‌రాజ‌యం కావ‌డం.. ప‌న‌బాక ల‌క్ష్మి ఎక్కడా దూకుడు చూపించ‌లేక పోవ‌డం వంటి ప‌రిణామాలు.. టీడీపీలో మ‌రో ర‌క‌మైన చ‌ర్చకు దారితీశాయి.

వారంతా భేటీ అయి….

ఇటీవ‌ల టీడీపీలోని ఎస్సీ సామాజిక వ‌ర్గాలు.. అత్యంత ర‌హ‌స్యంగా తిరుప‌తిలోని జీవ‌కోన‌లో భేటీ అయ్యాయి. పార్టీ అధ్యక్షుడి వ్యవ‌హార శైలిపై ద‌ళిత త‌మ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనోటా.. ఈనోటా.. ఈ నేత‌ల మ‌న‌సులోని మాట‌లు లీక‌య్యాయి. “ఎవ‌రిని అడిగి అభ్యర్థిని ప్రక‌టించారు?“ అని ఇక్కడి వారు ప్ర‌శ్నిస్తున్నారు. అంటే.. టికెట్ విష‌యంలో చంద్రబాబు ఎవ‌రితోనూ సంప్రదించ‌కుండానే ఖ‌రారు చేయ‌డాన్ని ఇక్కడి కీల‌క ద‌ళిత నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల‌కు కేవ‌లం 25 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికిప్పుడు పార్టీని ప‌రుగులు పెట్టించాల‌న్నా.. ప్రజ‌ల‌కు చేరువ అవ్వాల‌న్నా.. వీరిని మ‌చ్చిక చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర‌మైన‌ ఓట‌మి త‌మ్ముళ్లలో విభేదాల‌కు కార‌ణం కావ‌డం మ‌రో కోణంలో పార్టీలో అనైక్యత‌కు దారితీసింది.

ఓటమి పై వివరణలా?

తిరుప‌తి కార్పొరేష‌న్‌లో త‌మ వారిని గెలిపించుకోవాల‌ని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు త‌పించారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ వంటివారు బాగానే ప్రయ‌త్నించారు. అయితే.. వీరికి పార్టీ నుంచి స‌హాయ స‌హ‌కారాలు ల‌భించ‌లేదు. పైగా.. ఓడిపోయిన త‌ర్వాత‌.. రీజ‌న్ కోరుతూ.. వారికి లేఖ‌లు అందాయి. ఈ ప‌రిణామాల‌తో ఇక్కడి నేత‌లు.. హ‌తాశుల‌వుతున్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో తాము ఎంత మొత్తుకున్నా పార్టీ నుంచి చిన్న స‌హ‌కారం కూడా లేదుకాని.. ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక కోసం తాము మాత్రం ఎందుకు ప‌ని చేయాల‌ని వారు అధిష్టాన‌న్నే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితిని అధిగ‌మించి పార్టీని ముందుండి న‌డిపించ‌డం.. పార్టీని విజ‌యం దిశ‌గా అడుగులు వేయించ‌డం అనేది చంద్రబాబుకు త‌ల‌కు మించిన భారమేన‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News