ఒకటి వదలిచ్చుకునేలోగా మరొకటి…బుల్లెట్ లా వస్తున్నాయే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులదీ నాటకమని కొట్టిపారేశారు. దీనిపై స్పందించడం కూడా అనవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాటకమో.. బూటకమో [more]

Update: 2020-05-14 05:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులదీ నాటకమని కొట్టిపారేశారు. దీనిపై స్పందించడం కూడా అనవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాటకమో.. బూటకమో పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతూ జీవో జారీ చేయడం నిజమే కదా? అందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించారు కదా? ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అది రాయలసీమకు లాభమే కాదా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో నెటిజన్లు చంద్రబాబుకు సంధిస్తున్నారు.

నాటకమయితే ఎవరికి లాభం?

జగన్ పై విరుచుకుపడాదామనుకునేంతలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టుపై ఏపీలోని నీటిరంగ నిపుణులు, మేధావులు సయితం స్వాగతిస్తున్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సయితం జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. కానీ చంద్రబాబు మాత్రం ఇది నాటకంగా కొట్టిపారేస్తున్నారు. కరోనా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్, కేసీఆర్ లు కూడ బలుక్కుని పోతిరెడ్డి ప్రాజెక్టు వివాదానికి తెరలేపారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

ఎవరూ మాట్లాడవద్దంటూ….

అందుకే ఈ వివాదంపై ఎవరూ మాట్లాడవద్దని ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. కాంగ్రెస్ అయితే చలో పోతిరెడ్డి పాడు కార్యక్రమాన్ని కూడా పెట్టుకుంది. తెలంగాణ బీజేపీ అయితే ఏకంగా ఏపీపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కానీ ఇక్కడ టీడీపీ మాత్రం నో కామెంట్స్ అంటూ ఉంది.

మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం….

చంద్రబాబు మాత్రం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ఉండాలని మళ్లీ రెండు కళ్ల సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. దీనిపై ఏపీ టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నేతలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపు సమంజసమేనని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇది మరో రాజధాని తరలింపు అంశంగా మారి చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. రాజధాని తరలింపులో కూడా టీడీపీలో ప్రాంతాల వారీగా నేతలు విడిపోయిన సంగతి తెలిసిందే. మరి చంద్రబాబు పోతిరెడ్డిపాడు నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Tags:    

Similar News