బాబు జాతకం మళ్లీ మారుతుందా? అదే కారణమా?

చంద్రబాబుకు సెంటిమెంట్లు లేవు అంటారు. కానీ ఆయనకూ ఉన్నాయి అనేక సెంటిమెంట్లు. ముఖ్యంగా చంద్రబాబు అప్పట్లో వరసగా రెండు సార్లు ఎన్నికల్లో ఓడాక జాతకాలు, సెంటిమెంట్లు బాగా [more]

Update: 2020-05-21 14:30 GMT

చంద్రబాబుకు సెంటిమెంట్లు లేవు అంటారు. కానీ ఆయనకూ ఉన్నాయి అనేక సెంటిమెంట్లు. ముఖ్యంగా చంద్రబాబు అప్పట్లో వరసగా రెండు సార్లు ఎన్నికల్లో ఓడాక జాతకాలు, సెంటిమెంట్లు బాగా నమ్మడం మొదలెట్టారని అంటారు. ఇపుడు ముచ్చటగా మూడవసారి ఆయన ఓడారు. దాంతో సెంటిమెంట్ల్తో మరోమారు ఆయన కిందా మీదా అవుతున్నారు. చంద్రబాబు ఇపుడు హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన గత రెండు నెలలుగా అక్కడే ఉంటున్నారు. ఇదే కాదు, ఓడిపోయిన తరువాత నుంచి కూడా ఆయన అమరావతి నుంచి హైదరాబాద్ కి షటిల్ సర్వీస్ పెట్టుకున్నారు. వీకెండ్ వచ్చిదంటే చాలు ఆయన అమరావతిలో ఉండడంలేదు. ఇపుడు ఏకంగా అక్కడే మకాం వేశారు. ఇంతకీ చంద్రబాబు ఏరి కోరి రాజధాని చేసిన అమరావతిలో ఎక్కువ రోజులు ఉండకపోవడానికి కారణమేంటి అన్న దాని మీద ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

అచ్చిరాలేదా …?

చంద్రబాబు అమరావతి రాజధాని‌ని తనకు నచ్చినట్లుగానే డిజైన్ చేయించారు. ఆయన ఎక్కడ ఏమి ఉండాలో కూడా దగ్గరుండి మరీ ప్లాన్స్ గీయించారు. దీనికోసమే ఆయన విలువైన మూడేళ్ల కాలాన్ని వాడేశారు. ఇక వెలగపూడి ఈ పేరు ప్రాచుర్యంలోకి వచ్చిందంటే అది చంద్రబాబు పుణ్యమే. ఇక్కడ సచివాలయం ఏర్పాటు చేసి బాబు పాలన సాగించారు. అయితే ఈ సచివాలయం తాత్కాలికం అని చంద్రబాబు నిర్మించినా కూడా దీనికి కూడా ఎన్నో రిపేర్లు చేశారట. ఇక చంద్రబాబు సచివాలయంలో తాను కూర్చున్న సీటు వెనకాల బౌధ్ధ చిహ్నాన్ని తలపించేలా చక్రం ఒకటి బంగారు వన్నెతో పెట్టించుకున్నారుట. ఇన్ని చేసినా కూడా అది చంద్రబాబుకు అచ్చిరాలేదని అపుడూ, ఇపుడూ అంటున్నారు.

చికాకులేనా…?

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అయిదేళ్ళ కాలంలో కూడా చికాకులే చంద్రబాబుని పలకరించాయి. విపక్షంలో ఉన్న బలమైన వైసీపీ అడుగడుగున్నా ఇబ్బందులు పెడుతూ వచ్చింది. మరో వైపు జగన్ పాదయాత్ర, కాపు ఉద్యమాలు, కేంద్రంతో గొడవలు, చివరికి పార్టీ ఓడిపోవడం వరసగా చూసుకుంటే సచివాలయంలో చంద్రబాబు దర్జాగా పాలన చేసింది లేదని అంటారు. మరో వైపు ప్రపంచ రాజధాని అని ఎంతగా మొత్తుకున్నా కూడా కనీసంగా కూడా నిధుల సమీకరణ జరగలేదు. ఇంకో వైపు చూసుకుంటే పోలవరం లాంటి భారీ లక్ష్యాలు పెట్టుకున్నా ఏ ఒక్కటీ అమలు చేయలేక చంద్రబాబు అపఖ్యాతి పాలు కావాల్సివచ్చింది.

అదృష్ట రేఖ అలా….

ఈ నేపధ్యంలో ఓడిపోగానే చంద్రబాబు మళ్ళీ సెంటిమెంట్లకు పెద్ద పీట వేశారు. ఇక జోస్యాలు చెప్పేవారు కూడా బాబుకు వెలగపూడి సచివాలయం అచ్చిరాలేదని , పైగా గట్టిగానే దెబ్బ కొట్టేసిందని చెప్పారట. దాంతో పాటు ఆయన ఉండవల్లిలోని ఇల్లు కంటే కూడా వందల కోట్లతో హైదరాబాద్ లో కట్టించుకున్న ఇల్లు అన్ని రకాలుగా కలసివచ్చేలా ఉందని చెప్పారట. ఈ కారణంగానే చంద్రబాబు హైదరాబాద్ కు తరచూ వెళ్తూ వస్తున్నారని అంటున్నారు. ఇపుడు ఏకంగా లాక్ డౌన్ వేళ ఇంట్లో ఉండడానికి కూడా కారణం అక్కడే క్షేమమని భావించడమేనని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు ఎంతో ఇష్టపడిన అమరావతి కంటే కూడా భాగ్యనగరమే ఆయనకు అధికార సౌభాగ్యానికి దగ్గర దారి చూపిస్తుంది అన్న ఆశతో అక్కడే గడుపుతున్నారని అంటున్నారు. చూడాలి మరి చంద్రబాబు జాతకం ఈసారి అయినా ఏమైనా మారుతుందో లేదో.

Tags:    

Similar News