మరో మూడేళ్లు భరించాల్సిందే… సీన్ లోకి సింగిల్ గానే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు జరుగుతాయని చంద్రబాుబ ఆశించారు. కానీ జమిలి ఎన్నికలు వచ్చే ఏడాది [more]

Update: 2021-03-13 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు జరుగుతాయని చంద్రబాుబ ఆశించారు. కానీ జమిలి ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే అవకాశాలు కన్పించడం లేదు. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా గెలిచే అవకాశాలు లేవు. దీంతో 2024 లోనే సాధారణ ఎన్నికలకు బీజేపీ వెళ్లే అవకాశాలే ఉన్నాయి. దీంతో చంద్రబాబులో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.

రెండేళ్ల నుంచి…..

ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. ఈ రెండేళ్లలో గతంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని చంద్రబాబు చూడాల్సి వచ్చింది. పార్టీ నేతలందరూ సహకరించడం లేదు. ప్రభుత్వానికి భయపడి బయటకు రావడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతినింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్దగా విజయావకాశాలు ఉండవు. అనేక మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా అందులోనూ టీడీపీ స్కోర్ చేస్తుందన్న అంచనాలు లేవు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…..

ఇక అన్ని ఎన్నికలు ముగిసిన తర్వాత ఏం చేయాలన్నది చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికలకు నెలలు ముందే పార్టీ నేతలు బయటకు వచ్చే అవకాశముంది. అప్పటి వరకూ వారిని బలవంతంగా పార్టీ కార్యక్రమాల్లోకి తీసుకురావడం చంద్రబాబుకు కత్మిమీద సవాల్ గానే కనపడుతుంది. ఇక కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకూ వైసీపీ పదవులన్నీ ఆక్రమించడంతో టీడీపీ నేతల్లోనూ అసహనం, అసంతృప్తి వ్యక్తమవుతుంది.

యాక్టివ్ గా లేకపోవడంతో….

వచ్చే ఎన్నికలను వారిని యాక్టివ్ చేయాలంటే చంద్రబాబు శక్తి సామర్థ్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోయేట్లు లేవు. టీడీపీ నేతలను ఆర్థికంగా దెబ్బతీయడంతో వారిని బలవంతం చేసే పరిస్థితి కూడా లేదు. దాదాపు 70కి పైగా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు యాక్టివ్ గా లేరని స్థానిక సంస్థల ఎన్నికల ముందే చంద్రబాబుకు నివేదిక అందినా వారిని యాక్టివ్ చేయలేకపోయారు. జగన్ దూకుడు మీద ఉన్నారు. పార్టీలో కొత్త కార్యవర్గాన్ని నియమించినా పరిస్థితి ఆశాజనకంగా లేదు. దీంతో్ చంద్రబాబు మరో మూడేళ్లు సింగిల్ గా పోరాటం చేయాల్సిందేనంటున్నారు.

Tags:    

Similar News