ఎన్టీయార్..బ్రహ్మ ముహూర్తం..?

చంద్రబాబునాయుడుని అందుకే రాజకీయ గండర గండడు అని అంటారు. కాదేదీ వాడకానికి అనర్హం అన్న థియరీ బాబుది. తన పరం తేడా లేకుండా సమయానుకూలంగా దేనినైనా వాడుకోవడంలో [more]

Update: 2021-03-09 03:30 GMT

చంద్రబాబునాయుడుని అందుకే రాజకీయ గండర గండడు అని అంటారు. కాదేదీ వాడకానికి అనర్హం అన్న థియరీ బాబుది. తన పరం తేడా లేకుండా సమయానుకూలంగా దేనినైనా వాడుకోవడంలో ఆయన దిట్ట. ఎన్టీయార్ అల్లుడిగా టీడీపీలో చేరి టాప్ లెవెల్ నాయకుడిగా ఎదిగినా ఆ మీదట సొంత మామనే పక్కకు నెట్టేసి అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని పట్టేసినా అది ఒక్క చంద్రబాబుకే చెల్లు. పాతికేళ్ళ క్రితం ఎన్టీయార్ మరణించారు. అయినా ఇప్పటికీ ఆయన ఫోటోను, పేరుని తన పాలిటిక్స్ కొరకు వాడుకుంటున్న చంద్రబాబు ఇపుడు మరో అడుగు ముందుకేశారు.

అది బలమైన ముహూర్తమట …

ఎన్టీయార్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నాటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ప్రకటించారు. అది ఎన్టీయార్ పండితుల నుంచి అన్నీ చూసి పెట్టుకున్న శుభ ముహూర్తం. ఆ విధంగా ముహూర్త బలం గట్టిది కావడంతో మళ్ళీ మార్చి వచ్చేనాటిని ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. ఇక ఎన్టీయార్ కి ఒకసారి వెన్నుపోటు నాదెండ్ల రూపంలో ఎదురైతే తట్టుకున్నారంటే అది ముహూర్త బలమే అంటారు. రెండవమారు మాత్రం అది అసలు కాయలేకపోయింది. కానీ పార్టీ పెట్టిన సుహూర్తం పుణ్యమాని మరో ఏడాది నాటికి నాలుగు పదుల వయసును టీడీపీ పూర్తి చేసుకోబోతోంది. ఇపుడు చంద్రబాబు అదే చెబుతున్నారు. టీడీపీ స్థాపించిన ముహూర్తం గట్టిదని అంటున్నారు.

నమ్మకం లేకనా …?

ఇంతకాలం తన సామర్ధ్యం మీద చంద్రబాబు తెగ లెక్చర్లు దంచేవారు. పార్టీకి పటిష్టమైన కార్యకర్తల బలం ఉందని కూడా గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్పేవారు. నాయకులు ఎందరు పోయినా టీడీపీ గెలిచి తీరుతుందని కూడా ధీమా వ్యక్తం చేసేవారు. కానీ ఇపుడు చూస్తే మాత్రం సీన్ వేరేగా ఉంది. పంచాయతీ లెవెల్ లోనే పార్టీ పునాదులు కదిలిపోయాయి. దాంతో జాతకాలను పెద్దగా నమ్మని చంద్రబాబు నోటి వెంట ముహూర్తాలు, మూఢ విశ్వాసాలూ ఒక్కోటిగా అలా వస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా టీడీపీ బతికి ఉంటుంది తమ్ముళ్ళూ నన్ను నమ్మినా నమ్మకపోయినా ఫరవాలేదు ఎన్టీయార్ ని కూడా కాదు, ఆయన పెట్టిన ముహూర్తాన్ని నమ్మండి అంటూ చంద్రబాబు అంటున్నారు అంటేనే టీడీపీ దేని మీద ఆధారపడుతోందో అర్ధమైపోతోంది.

కాపాడుకోవడానికే…?

అదిగో ఎన్నికలు మరో ఏడాదిన్నరలో వచ్చేస్తున్నాయి. ఇక వచ్చేది మన ప్రభుత్వమే అని చంద్రబాబు బాగానే గర్జిస్తున్నారు. టీడీపీకి ఎదురులేరు, తిరుగులేదు అంటూ చెప్పుకొస్తున్నారు. ఏదో ముహూర్తాన పుట్టిన చాలా పార్టీలు దేశంలో ఇంకా అలాగే ఉన్నాయి. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ కూడా ఉంది. మరి అవి అధికారంలో శాశ్వతంగా ఉన్నాయా. మరి చంద్రబాబు ముహూర్తం అంటూ మూఢ నమ్మకాల వెంట పడుతున్నారు అంటేనే పతనం ఎక్కడో మొదలైందని కదా అంటున్నారు ప్రత్యర్ధులు. కుప్పంలో అన్ని పంచాయతీలు కోల్పోయాక చంద్రబాబు క్యాడర్ కి చెప్పుకోవడానికి ఏమీ లేక ఎన్టీయార్ పెట్టిన మంచి ముహూర్తం టీడీపీ గెలుస్తుంది అంటున్నారు. అదే నిజమనుకుంటే ఆ బలమైన ముహూర్తం ఎన్టీయార్ కి వెన్ను పోట్లు కాకుండా ఆపగలిగిందా. ఆయన్ని మాజీ ముఖ్యమంత్రిని కాకుండా ఉంచగలిగిందా. మరి ఈ లాజిక్ తమ్ముళ్లకు అర్ధమైతే చంద్రబాబు ముహూర్తాల కధలకు ఫుల్ స్టాప్ పడిపోయినట్లేగా.

Tags:    

Similar News