ఆ రెండు గాలిలో కలసిపోయినట్లేనా?

చంద్రబాబు రెండింటిపైనే నమ్మకం పెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ఆ రెండూ కారణమవుతాయని, తనకు అనుకూలంగా మారతాయని చంద్రబాబు గట్టిగా విశ్వసించారు. అందులో ప్రత్యేక హోదా, [more]

Update: 2021-03-05 11:00 GMT

చంద్రబాబు రెండింటిపైనే నమ్మకం పెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ఆ రెండూ కారణమవుతాయని, తనకు అనుకూలంగా మారతాయని చంద్రబాబు గట్టిగా విశ్వసించారు. అందులో ప్రత్యేక హోదా, అమరావతి. ఈ రెండు అంశాలు పంచాయతీ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. రాజధానికి పక్కనే ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సయితం వైసీపీ మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించడం విశేషం.

ప్రత్యేక హోదా విషయంలో….

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రప్రభుత్వం విభజన హామీల్లో పేర్కొంది. కానీ ఇంతవరకూ అమలు చేయలేదు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రకటించిన ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. వెనకబడిన ప్రాంతాల జిల్లాలకు ఇచ్చిన బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ నిధులు కూడా రావడం లేదు. అయినా జగన్ కేంద్ర ప్రభుత్వంపై ఏ మాత్రం వత్తిడి తీసుకురావడం లేదు. 22 మంది ఎంపీలున్న జగన్ పట్టనల్లే వ్యవహరిస్తున్నారు.ఇది తనకు అనుకూలంగా మారుతుందని చంద్రబాబు భావించారు.

కానీ అదే జిల్లాల్లో…..

కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ వైసీపీ అధికసంఖ్యలో పంచాయతీల్లో విజయం సాధించింది. అంటే ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ఏ ప్రాంత ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదనే అనుకోవాలి. ఇక అమరావతి రాజధాని అంశంలో కూడా చంద్రబాబు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుకుంటున్నారని, కావాలంటే రిఫరెండం పెట్టాలని చంద్రబాబు అనేక సార్లు సవాల్ విసిరారు.

రాజధాని అంశం కూడా….

కానీ అమరావతి ప్రాంతంలోనే పంచాయతీలు వైసీపీ పరమయ్యాయి. అమరావతిని రాజధానిగా ఆ ప్రాంత ప్రజలే అంగీకరించడం లేదని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఆశలు పెట్టుకున్న రెండు అంశాలు ఆయనకు పంచాయతీ ఎన్నికల్లో ఏ మాత్రం కలసి రాలేదు. జనం సంక్షేమం వైపు మొగ్గు చూపుతున్నారని చంద్రబాబుకు అర్థమయినట్లే ఉంది. అందుకే అమరావతి నినాదం ఇక గాలిలో కలసిపోయినట్లే.

Tags:    

Similar News