కుప్పం కాదు… పల్నాడులోనూ కోట‌లు కూలిపోతున్నాయ్ ?

చంద్రబాబుకు పేరుకు మాత్రమే చిత్తూరు జిల్లా వ్యక్తి… కానీ సీమ జ‌నాలు ఆయ‌న్ను మాత్రం త‌మ ప్రాంతానికి చెందిన వాడిగా చూస్తారా అంటే చాలా డౌట్లే పుడ‌తాయి. [more]

Update: 2021-03-04 15:30 GMT

చంద్రబాబుకు పేరుకు మాత్రమే చిత్తూరు జిల్లా వ్యక్తి… కానీ సీమ జ‌నాలు ఆయ‌న్ను మాత్రం త‌మ ప్రాంతానికి చెందిన వాడిగా చూస్తారా అంటే చాలా డౌట్లే పుడ‌తాయి. 1999లో చంద్రబాబు తొలి సాధార‌ణ ఎన్నిక‌లు ఎదుర్కొన్నారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు సీమ ప్రాంతంలో టీడీపీకి ఎప్పుడూ మెజార్టీ రాలేదు. ఒక్క సీమ మాత్రమే కాదు… నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ టీడీపీకి గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఎదురు దెబ్బలు త‌గులుతూనే ఉన్నాయి. చంద్రబాబు ఎప్పుడూ ఉత్తరాంధ్రనో, లేదా గోదావ‌రి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాల‌నే న‌మ్ముకుని.. ఇక్కడ వ‌చ్చిన సీట్లతోనే ముఖ్యమంత్రి అవుతోన్న ప‌రిస్థితి. 1999 కావొచ్చు… రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక 2014 ఎన్నిక‌ల్లో కావొచ్చు… పైన చెప్పుకున్న ప్రాంతాల్లో టీడీపీకి వ‌చ్చిన సీట్లతోనే ఆయ‌న సీఎం అయ్యారు.

ఓన్ చేసుకోక పోవడంతో….

ఎందుకో గాని సీమ జ‌నాలు నాడు వైఎస్‌ను, ఇప్పుడు జ‌గ‌న్‌ను మ‌న‌వాడు అంటూ ఓన్ చేసుకుంటారే గాని… చంద్రబాబును అసలు సీమ వాడిగా గుర్తిస్తున్నారా ? అన్నది డౌటే ? చంద్రబాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్రగిరి విషయానికి వ‌స్తే ఆయ‌న్నే ఓడించిన చ‌రిత్ర ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌ది. చివ‌ర‌గా అక్కడ టీడీపీ 1994లో ఎన్టీఆర్ టైంలో మాత్రమే గెలిచింది. చంద్రబాబు టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టాక రెండు సార్లు సీఎం అయినా చంద్రగిరిలో గ‌త రెండున్నర ద‌శాబ్దాల్లో ఒక్కసారి కూడా టీడీపీ జెండా ఎగ‌ర‌లేదు. ఇక ఇప్పుడు చంద్రబాబు గ‌త రెండున్నర ద‌శాబ్దాల‌కు పైగా త‌న కంచుకోట‌గా మార్చుకున్న అదే చిత్తూరు జిల్లా కుప్పం కంచుకోట కూడా క‌రిగిపోతోంది.

సొంత నియోజకవర్గంలోనూ…..

ఆరుసార్లు గెలిచి కుప్పంలో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టిన చంద్రబాబుకు తాజా స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ఘోర అవ‌మాన‌మే మిగిలింది. కుప్పంలో 89 పంచాయ‌తీల‌కు గాను టీడీపీ కేవ‌లం 15 పంచాయతీల‌తో స‌రిపెట్టుకోగా… వైసీపీ ఏకంగా 74 పంచాయ‌తీలు గెలిచింది. రేపు జ‌రిగే కుప్పం మున్సిపాల్టీలోనూ టీడీపీ గెల‌వ‌డం క‌ష్టంగానే కనిపిస్తోంది. చంద్రబాబు రెండున్నర ద‌శాబ్దాలుగా ఎన్నోసార్లు ఛాన్సు వ‌చ్చినా సీమ‌ను ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ఆ ప్రభావమే కుప్పంపై ప‌డి కుప్పం కూడా కూలిపోయేలా ఉంది.

గుంటూరులోనూ బీటలు….

ఆ మాట‌కు వ‌స్తే బాబును ఎప్పుడూ సీఎం చేసే విష‌యంలో కీల‌కంగా ఉన్న గుంటూరు జిల్లాలోనూ టీడీపీ కోట‌లు కూలిపోతున్నాయి. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఇవి టీడీపీకి పెట్ట‌ని కోట‌లుగానే ఉన్నాయి. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లోనూ ప‌లు టీడీపీ కంచుకోట‌ల‌ను వైసీపీ బ‌ద్దలు కొట్టేసింది. ఇప్పుడు ప‌ల్నాడులోని నాలుగైదు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ త‌ర‌పున నామినేష‌న్లు వేయ‌లేని దుస్థితి. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో మూడు స‌ర్పంచ్ స్థానాలు మిన‌హా అన్నింట్లోనూ వైసీపీ ఏక‌గ్రీవ విజ‌యం సాధించింది. అదే మాచ‌ర్లలో మున్సిపాల్టీతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ స్థానాలు కూడా 90 శాతం ఏక‌గ్రీవం అయ్యాయి.

పల్నాడులో అయితే…?

న‌ర‌సారావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక స‌ర్పంచ్ ఎన్నిక‌లే కాకుండా… ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు… చివ‌ర‌కు మున్సిపాల్టీలోనూ 60-70 శాతం స్థానాలు ముందుగానే ఏక‌గ్రీవం అయిపోయాయి. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలోనే 15 పంచాయ‌తీలు వైసీపీకి ఏక‌గ్రీవం అయ్యాయి. టీడీపీ కంచుకోటే కాకుండా 70 వేల క‌మ్మ వ‌ర్గం ఓట‌ర్లు ఉన్న వినుకొండ‌లోనూ ప‌లు చోట్ల టీడీపీ వాళ్లు నామినేష‌న్లు వేయ‌లేని ప‌రిస్థితి. ఇక గుర‌జాల అంటేనే య‌ర‌ప‌తినేని.. య‌ర‌ప‌తినేని అంటేనే గురజాల‌.. అలాంటి చోట ఒక్క ఎంపీపీ లేదా జ‌డ్పీటీసీ లేదా మూడు మున్సిపాల్టీల్లో ఏ ఒక్కటి కూడా టీడీపీకి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే ప‌ల్నాడు వైసీపీకి మరో సీమ‌లా కంచుకోట అయినా ఆశ్చర్యపోన‌క్కర్లేదు.

Tags:    

Similar News