రాజకీయ వేత్తగా మారలేవా బాబూ ?

చంద్రబాబుకు రాజకీయమే ఊపిరి. ఆయన ఉచ్చ్వాస నిశ్వాసాలు రాజకీయాన్నే తలుస్తాయి. ఆయనకు వేరే వ్యాపకం లేదు. రాజకీయాతోనే ఆయన దినచర్య మొదలై ముగుస్తుంది. సరే ఆయనకు అంత [more]

Update: 2021-02-28 13:30 GMT

చంద్రబాబుకు రాజకీయమే ఊపిరి. ఆయన ఉచ్చ్వాస నిశ్వాసాలు రాజకీయాన్నే తలుస్తాయి. ఆయనకు వేరే వ్యాపకం లేదు. రాజకీయాతోనే ఆయన దినచర్య మొదలై ముగుస్తుంది. సరే ఆయనకు అంత ఇష్టం రాజకీయాలు అనుకున్నా కూడా సీనియర్ మోస్ట్ లీడర్ గా తన స్పూర్తిని భావి తరాలకు ఆయన ఉంచాలిగా. మరి చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి. పార్టీని పాతికేళ్ళుగా నడుపుతూ దేశంలో కూడా సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. మరి బాబు హుందాతనంగా విమర్శలు చేయాలిగా.

ఓడితే సంబంధం లేదా..?

ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న చంద్రబాబు రాజకీయాలు వద్దు అభివృద్ధే ముద్దు అంటూ నినదించేవారు. మరి ఓడాక కూడా అదే రీతిగా నీతిగా నిలబడాలిగా. కానీ బాబు వరస చూస్తూంటే విపక్షంలో ఉంటే ప్రతీ దానికీ యాగీ చేయడమే పని అన్నట్లుగా ఉంది. ఇక ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేస్తోంది. అదే సమయంలో ఒక్క పైసా కూడా విదల్చకపోగా బంగారం లాంటి పరిశ్రమలను కూడా ప్రైవేట్ పరం చేస్తోంది. మరి దీని మీద సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న చంద్రబాబు చేయాల్సింది ఏంటి. ఏపీ ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్నది ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

పెద్దన్న పాత్రలో …..

చంద్రబాబు వయసు రిత్యా అనుభవం రిత్యా అందరూ గౌరవిస్తారు, కానీ ఆయన రాజకీయ విధానాలనే వ్యతిరేకిస్తారు. ఏపీకి తీరని అన్యాయం జరుగుతూంటే చంద్రబాబు మాత్రం జగన్ మీదనే బాణాలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అమ్ముకుంటున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇది నిజంగా దారుణమైన విమర్శగానే చూడాలి. కేంద్రానికి చెందిన ఒక సంస్థ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు, దాని పాత్ర ఎంత వరకూ ఉంటుంది. ఎవరో చిన్న నాయకుడు ఈ తరహా విమర్శలు చేస్తే ఏమో అనుకుంటారు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు లాంటి వారు చేస్తే కచ్చితంగా జనాలు ఆయననే తప్పు పడతారు.

ఎవరితో పోటీ….

నిజానికి ఈ మాట కూడా అనకూడదేమో. జగన్ చాలా హుందాగానే ఉంటున్నారు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అంతవరకే పరిమితం అవుతున్నారు. చంద్రబాబు మీద పల్లెత్తు మాట కూడా అనడంలేదు. మరి ఆ హుందాతనాన్ని వేరే విధంగా తీసుకుని బాబు తనకు తానుగా తగ్గించుకుని మట్లాడాల్సిన అవసరం ఉందా అన్నదే ప్రశ్న. చంద్రబాబు ఈ సమయంలో నిలదీయాల్సింది కేంద్రాన్ని, ప్రధాని మోడీ మీద 2018లో ఆయన ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఇపుడు ఉక్కు పోరాట దీక్షలు చేస్తే జనం నమ్ముతారు. మద్దతు పెరుగుతుంది. అలా కాదనుకుని ఆయన ఏపీ సర్కార్ మీదనే విమర్శలు చేయడం అంటే ఫక్త్ పాలిటిక్స్ గానే అంతా చూస్తున్నారు. మరి చంద్రబాబు అనుభవం ఘనం. ఈ వయసులోనైనా రాజకీయ నాయకుడి నుండి రాజకీయ వేత్తగా మారలేరా. ధర్మ సూత్రాలను అనుసరించి జనాల్లో పేరు తెచ్చుకోలేరా అన్నదే అందరి ప్రశ్న‌గా ఉంది.

Tags:    

Similar News