చివరకు నిమ్మగడ్డ కూడా మోసం చేశారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేక పోయారు. సీనియర్ నేతలున్న నియోజకవర్గాల్లో సయితం పార్టీ పట్టు కోల్పోయింది. [more]

Update: 2021-02-23 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేక పోయారు. సీనియర్ నేతలున్న నియోజకవర్గాల్లో సయితం పార్టీ పట్టు కోల్పోయింది. పంచాయతీ ఎన్నికల్లో ఎంతో కొంత పట్టు సాధించి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవ్వాలని భావించిన చంద్రబాబుకు ఎన్నికల ఫలితాలు నిరాశను మిగిల్చాయని చెప్పాలి. ఏ జిల్లాలోనూ టీడీపీ పట్టు సాధించలేకపోవడం ఆ పార్టీ పరిస్థితిని చెప్పకనే తెలుస్తోంది.

ఎమ్మెల్యేలున్న చోట…..

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో నలుగురు వైసీపీ మద్దతుదారులుగా మారిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో సయితం పార్టీ పెద్దగా విజయాలను సాధించలేకపోయింది. అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మాడ నియోజకవర్గంలోనూ అధిక పంచాయతీలు వైసీపీ కైవసం చేసుకుంది. అదే జిల్లాలోని ఇచ్ఛాపురంలోనూ వైసీపీ జెండాయే ఎగరడం విశేషం.

ఈ జిల్లాలపై ఆశలు….

గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై చంద్రబాబు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని అంచనా వేశారు. ఈ జిల్లాల నేతలతో తరచూ మాట్లాడుతూ వారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. అయినా జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీ మద్దతుదారులనే ఎక్కువ సంఖ్యలో గెలవడం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. అందుకే తమకు ఇన్నాళ్లు అండగా నిలిచిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కూడా మండిపడుతున్నారు.

ఎవరూ ముందుకు రాక….

గ్రామాల్లో పట్టు కోల్పోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుటు ఉపాధి హామీ పథకం కింద తెలుగుతమ్ముళ్లకు కోట్ల రూపాయల పనులు ఇచ్చారు. అయితే వీటికి సంబంధించి బిల్లులు మాత్రం ఇవ్వలేదు. ఎన్నికల సమయం కావడంతో గెలిచిన తర్వాత ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లులను పెండింగ్ లో పెట్టింది. దీంతో వారంతా అప్పులపాలయి, నిరాశలో ఉండి పంచాయతీ ఎన్నికలను పట్టించుకోలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. మొత్తం మీద చంద్రబాబు కు పంచాయతీ ఎన్నికలు ఊహించని షాక్ ఇచ్చాయనే చెప్పాలి.

Tags:    

Similar News