ఇంకా సెట్ కాలేదే…? ఆ ఫైర్ లేదే? ఇలాగయితే ఎలా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని నడపడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఎప్పుడూ నేతలతో టచ్ లో ఉంటూ చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ [more]

Update: 2020-05-20 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని నడపడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఎప్పుడూ నేతలతో టచ్ లో ఉంటూ చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో ఉండిపోయిన చంద్రబాబు ఎటూ కదలలేని పరిస్థిితి. అందుకే అక్కడి నుంచే పార్టీని పటిష్టపర్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతగా పోషిస్తున్నారు. వేగంగా స్పందించినా చంద్రబాబు దెబ్బకు వైసీపీ నేతలు అనేక సందర్భాల్లో ఇరకాటంలో పడుతున్నారు.

చంద్రబాబు అక్కడ ఉండి సక్సెస్ అవుతున్నా…

మిగిలిన పక్షాలతో సయోధ్యగా మెలుగుతూ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కానీ ఎటొచ్చీ నేతలే సరిగా స్పందించడం లేదంటున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు సయితం ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. కనీసం రోడ్డుపైకి వచ్చి ప్రతిపక్షంగా గళం విన్పించని పరిస్థితి నెలకొంది. పేదలకు ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు దీక్ష చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇంట్లోనే కాబట్టి కొంతమంది దీక్ష చేశారు.

స్థానిక నేతలు మాత్రం….

ఇక చిత్తూరు జిల్లాలో బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆర్కే రోజా, నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న విమర్శలు ఉన్నాయి. వీరికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మూడు జిల్లాల్లో టీడీపీ నేతల రెస్పాన్స్ అసలు లేకపోవడాన్ని చంద్రబాబు సీిరియస్ గా తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు మాత్రమే వీటిపై స్పందించాల్సి వచ్చిందని, స్థానిక నాయకత్వం మాత్రం సరైన సమయంలో కదలలేదని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలిసింది.

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలోనూ…

ిఅలాగే విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో కూడా టీడీపీ నేతలు అదే తీరును ప్రదర్శించడంపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. విశాఖపట్నంలో నలుగురు ఎమ్మెల్యులు ఉన్నా గ్యాస్ లీక్ ఘటన జరిగిన వెంటనే స్పందించలేదని, స్థానిక ఎమ్మెల్యే గణబాబుకు అండగా నిలవలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీంతో వైసీపీకి మైలేజీ వచ్చిందని చంద్రబాబు లోకల్ నేతలపై ఫైరయినట్లు తెలిసింది. మొత్తం మీద చంద్రబాబు ఆశించినట్లు టీడీపీ నేతల్లో ఫైర్ లేదు. అన్ని విధాలుగా చెబుతున్నా టీడీపీ నేతలు కదలకపోవడంపై ఆయన సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు.

Tags:    

Similar News