ఆ మాజీని మళ్లీ అక్కున చేర్చుకుంటారట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ ప్రయోజనం ఉంటేనే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ఇది పార్టీలో అందరికీ తెలిసిన సత్యమే. మొన్నటి వరకూ పార్టీలోకి అప్పుడే ఎవరినీ [more]

Update: 2021-02-14 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ ప్రయోజనం ఉంటేనే ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ఇది పార్టీలో అందరికీ తెలిసిన సత్యమే. మొన్నటి వరకూ పార్టీలోకి అప్పుడే ఎవరినీ చేర్చుకునేది లేదని చెప్పిన చంద్రబాబు ఒకరి విషయంలో మాత్రం చేర్చుకునేందుకు రెడీ అయిపోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన పాలపర్తి డేవిడ్ రాజును తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు.

తొలుత తెలుగుదేశమే….

నిజానికి పాలపర్తి డేవిడ్ రాజు తొలి నుంచి తెలుగుదేశం పార్టీ నేత. ఆయన తొలిసారి ఒంగోలు జడ్పీ ఛైర్మన్ గా టీడీపీ తరుపున పనిచేశారు. టీడీపీ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. 2014లో మాత్రం వైసీపీలో చేరారు. అప్పుడు యర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పాలపర్తి డేవిడ్ రాజు తర్వాత హ్యాండిచ్చి టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికలలో పాలపర్తి డేవిడ్ రాజుకు టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి వైసీపీలో చేరిపోయారు.

అటు.. ఇటు..మారి…..

ఇలా అటు, ఇటు చేరుతున్న పాలపర్తి డేవిడ్ రాజు తిరిగి టీడీపీలో చేరేందుకు ఆ మధ్య సిద్ధమయ్యారు. జిల్లా నేత దామచర్ల జనార్థన్ ను కూడా కలిశారు. అయితే చంద్రబాబు మాత్రం ఇప్పుడే చేరికలు వద్దని వారించినట్లు తెలిసింది. అయితే పాలపర్తి డేవిడ్ రాజు దళిత నేత. ఆయనను ఈ సమయంలో తీసుకుంటే బాగుంటుందని కొందరు నేతలు చంద్రబాబుకు సూచించినట్లు చెబుతున్నారు. ఏపీలో దళితులపై జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తున్న టీడీపీకి పాలపర్తి డేవిడ్ రాజు చేరిక మరింత బలం చేకూరుస్తుందంటున్నారు.

దళిత వాయిస్ పెరుగుతుందనే…..

దీనికి తోడు ఇటీవల చంద్రబాబు క్రిస్టియన్లు, ఫాదర్ లపై చేసిన వ్యాఖ్యలతో దళితవర్గం దూరమవుతుందన్న అభిప్రాయం పార్టీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. హిందూ మతానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దళితనేతను పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో దళితుల వాయిస్ ను పెంచేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు.

Tags:    

Similar News