అంతా ఆయనవల్లనేనటగా

ఇంత పరిస్థితికి రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణమని చెప్పక తప్పదు. ఏ పార్టీకైనా గెలుపోటములు ఉంటాయి. సహజమే. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు సయితం ఇన్ స్టెంట్ [more]

Update: 2019-11-18 05:00 GMT

ఇంత పరిస్థితికి రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణమని చెప్పక తప్పదు. ఏ పార్టీకైనా గెలుపోటములు ఉంటాయి. సహజమే. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు సయితం ఇన్ స్టెంట్ ఎదుగుదలను కూడా కోరుకోరు. కొన్నాళ్లు వెయిట్ చేస్తారు. రాజీకీయాల్లోకి వచ్చిన వారంతా ఇదేరకమైన ఆలోచన చేస్తారు. త్వర త్వరగా పార్టీలు మారి ఎదుగుదామని ఏ రాజకీయనేత భావించారు. కానీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు టీడీపీ నేతలకు ఆయనే ఆ అవకాశం ఇచ్చారన్నది స్పష్టంగా తెలుస్తోంది.

ఎందుకు వెళుతున్నారు?

అందుకే తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొరొక్కరుగా పార్టీని వీడి వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లడానికి కారణమేంటి? చంద్రబాబుపైన నమ్మకం లేకనా? ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదనా? అంటే ఆ రెండు కారణాలు పెద్దగా కన్పించడం లేదు. ఎందుకంటే ఏపీలో వైసీపీకి ప్రత్యమ్నాయం తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నది అందరికీ తెలుసు. అధికార పార్టీపై వ్యతిరేకత వస్తే తిరిగి టీడీపీ పుంజుకుంటుందని కూడా పార్టీని వీడి వెళుతున్న నేతలకు తెలియంది కాదు.

ఆ అవకాశాన్ని…..

అయితే ఇక్కడ పార్టీని వీడి వెళ్లే అవకాశం నేతలకు చంద్రబాబే అవకాశం కల్పించారంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయారు. ఏకంగా రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. నలుగురు రాజ్యసభ సభ్యులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. ఎన్నికల ముందు వరకూ బీజేపీ పై విరుచుకు పడిన చంద్రబాబు తమ పార్టీ నేతలను తీసుకెళ్లినా కనీస స్పందన లేదు. పైగా వారితో టచ్ లో ఉంటున్నారన్నది పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం. చంద్రబాబు కావాలనే వారిని బీజేపీలోకి పంపారంటున్నారు.

వెళ్లే వారితో మాటలేంటి?

ఇక కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి బీజేపీ పెద్దలను కలసి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చి మాట్లాడి మరీ పంపారంటున్నారు. ఇలా చంద్రబాబు కొందరి నేతలను దగ్గరుండి బీజేపీలోకి పంపారన్న సంకేతాలు రావడంతోనే మిగిలిన నేతలు కూడా ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కూడా అదే రూట్లో ఉన్నారు. అదే చంద్రబాబు తొలినాళ్లలోనే పార్టీ మారిన వారిని కట్టడి చేసి ఉన్నా, వారిపై విమర్శలు చేసినా ఇంతటి నష్టం పార్టీకి జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం కూడా సీనియర్ నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో రాంగ్ టైమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వ్యాఖ్యలు పార్టీలో విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News