వైఎస్ రికార్డ్ రిపీట్ చేయాలనే ?

చంద్రబాబు తాను అందరి కంటే గొప్ప, సీనియర్ అనుకుంటారు కానీ ఆయన మాత్రం చాలా మందిని రాజకీయంగా ఏ మొహమాటం లేకుండానే అనుసరిస్తారు. తన రాజకీయ భవిష్యత్తుకు [more]

Update: 2021-01-30 08:00 GMT

చంద్రబాబు తాను అందరి కంటే గొప్ప, సీనియర్ అనుకుంటారు కానీ ఆయన మాత్రం చాలా మందిని రాజకీయంగా ఏ మొహమాటం లేకుండానే అనుసరిస్తారు. తన రాజకీయ భవిష్యత్తుకు ఏదైనా పనికివస్తుంది అనుకుంటే దానిని వెంటనే అమలు చేయడానికి చంద్రబాబు ఎక్కడా వెనకాడరు. ఫలనా వారు దాన్ని చేశారు, చంద్రబాబు అనుసరిస్తున్నారు అని ఎవరనుకున్నా కూడా ఆయనకు భే ఫికర్. ఇక రాజకీయాల్లో చంద్రబాబుకు పోటీ వైఎస్సార్ తోనే ఎపుడూ ఉండేది అంటారు. ఎందుకంటే ఇద్దరూ సమకాలీకులు కాబట్టి.

అది సాధ్యపడింది కానీ …?

వైఎస్సార్ తనదైన దూకుడు రాజకీయంతో మూడు దశాబ్దాల పాటు ఏ అధికారిక పదవీ లేకుండానే నిత్య అసమ్మతి నేతగా కాంగ్రెస్ లో మిగిలిపోయారు. చంద్రబాబుకు ఎన్టీయార్ లాంటి మామ ఉన్నారు. దాంతో టీడీపీకి హై జాక్ చేసి మరీ సీఎం అయిపోయారు. ఇక జన్మలో వైఎస్సార్ సీఎం కాడు అని చంద్రబాబు అనుకున్న వేళ ఆయన హఠాత్తుగా పాదయాత్ర చేసి మరీ కుర్చీ పట్టేశారు. రెండవసారి వైఎస్సార్ అసలు గెలవడు అనుకుంటే అదీ చేసి చూపించారు. వైఎస్సార్ బతికి ఉంటే కనుక పదేళ్ల పాటు ఏకధాటిగా సీఎం గా చేసి చంద్రబాబు కంటే ముందే ఎక్కువ కాలం పనిచేసిన రికార్డు సొంతం చేసుకునే వారు. కానీ ఆయన మరణించడంతో బాబు కొత్త రికార్డు నెలకొల్పారు.

ఇక్కడా పోటీయే…?

ఇక చంద్రబాబుకూ, వైఎస్సార్ లకూ కుమారులు ఉన్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్సార్ వారసుడిగా జగన్ ఎంపీ అయ్యారు. దాంతో తెర 2014 నాటికి లోకేష్ ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి చంద్రబాబు తెచ్చారు. జగన్ తండ్రిని కోల్పోయి సొంత పార్టీ పెట్టి అష్టకష్టాలు పడ్డారు. 2014 ఎన్నికల్లో ఓడిపోవడంతో జగన్ కి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏ పదవీ చేపట్టకుండానే రాజకీయ నిష్క్రమణ జరుగుతుందా అని ఒక దశలో ఆయన పార్టీలోనే చర్చకు వచ్చింది అంటే జగన్ ఎంతగా టీడీపీ టార్గెట్ అయ్యారో ఊహించవచ్చు. జగన్ ఇలా ఎటూ కాకుండా పోయిన వేళ తన కుమారుడు లోకేష్ ని తెచ్చి మంత్రిగా చేశారు బాబు, అయిదు కీలకమైన మంత్రిత్వ శాఖలను కూడా అప్పగించారు. దాంతో జగన్ కంటే లోకేష్ ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడని తలచి చంద్రబాబు మురిశారు.

అది అయ్యే పనేనా…?

కానీ ఓడలు బళ్ళు అయినట్లుగా టీడీపీ జాతకం తిరగబడింది. జగన్ 151 సీట్ల మెజారిటీతో 2019 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టి ముఖ్యమంత్రి అయ్యారు. జన్మలో సీఎం కాలేడు అనుకున్న జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే తన కుమారుడిని సీఎం చేయాలని తపన పడిన చంద్రబాబుకు లోకేష్ మంగళగిరి పరాజయం తీరని వ్యధగా మిగిలింది. సరే స్నేహితులు అయిన వైఎస్సార్, చంద్రబాబు ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. వైఎస్సార్ కుమారుడు కూడా సీఎం అయి కొత్త రికార్డ్ సృష్టించారు. మరి ఈ పోటీలో మిగిలిపోయింది లోకేష్ మాత్రమే. అందుకే చంద్రబాబులో కసి మొదలైంది. తన కుమారుడినీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టి వైఎస్సార్ ఫ్యామిలీ సాధించిన రికార్డుని తానూ రిపీట్ చేయాలని తెగ ఆశపడుతున్నారు. మరి అది అయ్యే పనేనా. వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News